చైనా అమ్మడి  హెయిర్  సర్కస్ (వీడియో)

First Published Oct 12, 2017, 11:04 AM IST
Highlights

విశేష వార్తలు

  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఏపి రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు
  • నూజివీడు ఎస్సైపై సస్పెన్షన్ వేటు
  • రేపు ఉప్పల్ స్టేడియం భారీ బందోబస్తు 
  • ముగిసిన శశికళ పెరోల్ గడువు

చైనా అమ్మడి హెయిర్ సర్కస్ (వైరల్ వీడియో)

ఇక్కడ ఇది హెయిర్ స్టయిల్ సర్కస్. ఈ చైనా అమ్మాయి జుట్టుతో ఎన్ని డిజైన్లు వేస్తున్నదో చూడండి. ఇదొక అద్భుతం, శిరోజాలకు చిత్రాలు నేర్పించిందా లేక ఈ పిల్ల కూర్చున్న మ్యాట్రెస్ మహిమయా...ఈ వీడియో వైరలైపోయింది. సోషల్ మీడియాలో...అమ్మాయి హెయిర్‌ స్టయిల్‌ వీడియోను చైనా డెయిలీ బుధవారం పోస్ట్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోను  8 మిలియన్ల మంది చూశారని, 263,703 మంది షేర్ చేశారని.. చైనా డెయిలీ చెబుతోంది.

నిజాం, ఎన్టీఆర్ పాలించిన సెక్రటేరియట్ ఎలా ఉందంటే..? (వీడియో)

సచివాలయంలోకి ఎంటర్ కాగానే ఒక హెరిటేజ్ భవనం కనిపిస్తది. ఇందులో ఇప్పుడు ఎవరూ ఉంటలేరు. సచివాలయం తొలి భవనం ఇదే. ప్రస్తుతం హెరిటేజ్ భవనం హోదా దక్కింది కానీ పూర్తిగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉందీ భవనం. ఈ భవనాన్ని 1888 లో నిజాం రాజులు తమ అధికారిక నివాసంగా నిర్మించుకున్నారు. అనంతరం ఈ భవనం ఎందరో సీఎంలకు అధికారిక భవనంగా విరసిల్లింది. చివరగా ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చివరగా ఈ భవనం నుంచి కార్యకలాపాలు సాగాయి. అంతలా వెలుగు వెలిగిన ఈ భవనం ఇప్పుడు ఇలా మారింది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇటీవల రెండో అంతస్తులో కొంత భాగం కూలిపోయింది. ఈ భవనం ప్రమాదకర స్థితిలో ఉండడంతో పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనంలో పదేళ్ల కిందటి వరకు ఎంట్రీ ఉండేది. జర్నలిస్టుల గది, ఉద్యోగ సంఘాల నేతల ఆఫీసు మనుగడలో ఉండేవి. కానీ పదేళ్ల నుంచి ఎంట్రీ లేకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. రేపో మాపో కూలిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భవనంతో అనుబంధం ఉన్న సీనియర్ సిటిజన్లు సచివాలయం వచ్చినప్పుడు బిల్డింగ్ వైపు చూసి తమ పాత స్మృతులను నెమరు వేసుకుంటుంటారు.

ఉద్యోగ ప్రకటనల వేగం పెంచిన తెలంగాణ సర్కారు

తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతి జారీ చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా గల 22 గురుకుల డిగ్రీ కళాశాలల్లో మొత్తం 1455 టీచింగ్  మరియు నాన్ టీచింగ పోస్ట్ లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగల భర్తీని టీ ఎస్ పి ఎస్సీ ద్వారా చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉద్యోగాల వివరాలు
ప్రిన్సిపల్స్     :   22
లెక్చరర్లు      :  880. 
లైబ్రెరియన్లు   :  22
ఫిజికల్ డైరెక్టర్లు :  22

హిమాచల్ ప్రదేశ్ లో మోగిన ఎన్నికల నగారా
 

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నేటి నుండి హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎమ్, వివిపాట్ యంత్రాల ద్వారా ఓటింగ్ ప్రక్రియను జరపనున్నట్లు ఎనన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్దానాల్లో జరగనున్న ఈ ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 20 న    ముగుస్తుందని అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొంది.
తేదీల వారిగా వివరాలు
అక్టోబర్ 16 న విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 16 న విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 24 నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 26 నామినేషన్ల ఉపసంహరణ
నవంబర్ 9 న ఎన్నికలు
డిసెంబర్ 18 ఫలితాలు
హిమాచల్ ప్రదేశ్ లో  మొత్తం 7521 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయనున్నట్లు, మొదటిపారి కేవలం మహిళల కోసమే 136 మహిళా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.
 

ఏపి రాజధాని ప్రాంతంలో మరోసారి భూకంపం 

కృష్టా జిల్లా గన్నవరం ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. గన్నవరం ఎయిర్ పోర్టు ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల లోంచి బయటకు వచ్చిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. రెండు రోజుల క్రితమే ఓ సారి భూకంపం సంభవించగా, మరో సారి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది.
 
 

నూజివీడు ఎస్సైపై సస్పెన్షన్ వేటు

ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నూజివీడు ఎస్సై వెంకట కుమార్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తన భర్తకు సంబందించిన కేసులో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ దగ్గర పోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పటినుంచి ఆమెను తనతో గడపాలంటూ వేధించసాగాడు. ఇతడి ఫోన్ సంబాషనను రికార్డు చేసిన మహిళ ఈ విషయంపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన ఉన్నతాధికారులు ఎస్సై ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 

ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న టీ 20 మ్యాచ్ కు 1,800 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సిపి మహేష్ భగవత్ తెలిపారు. మహిళా అభిమానుల కు రక్షణగా  షీ టీమ్స్ ను కూడా స్టేడియంలో మొహరించినట్లు ఆయన వివరించారు.  56 సీసీ కెమెరాలతో గ్రౌండ్ లోపల మరియు చుట్టుపక్కల నిఘా ఉంచనున్నట్లు సిపి తెలిపారు.
రేపు సాయత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని, అందువల్ల సాయంత్రం 4 గంటలనుండి అభిమానులను గ్రౌండ్ లోకి  అనుమతిస్తామని అన్నారు.
స్టేడియం లోకి పవర్ బాక్స్, టిఫిన్ బాక్స్,లాఫ్ టాప్, కెమెరాలు, మ్యాచ్ బాక్స్,బాటరీస్, హెల్మెంట్స్, వాటర్ బాటిల్స్ తో పాటు ఎలెట్రికల్ పరికరాల వంటి నిషేధిత వస్తువులు అనుమతించబోమని, అభిమానులు వీటిని దృష్టిలో పెట్టకోవాలని సూచించారు.
 

శశికళ మళ్లీ జైలుకు 

అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తూ పెరోల్ పై బయటకు వచ్చిన శశికళ ఇవాళ మళ్లీ జైలుకు చేరారు. ఆమె భర్త నటరాజన్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నందున పెరోల్ కు దరఖాస్తు చేసుకోగా, జైళ్ల శాఖ షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెకిచ్చిన ఐదురోజుల గడువు ముగియడంతో ఇవాళ మళ్లీ కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలుకు చేరుకున్నారు.

''ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు''
 

2008 లో నోయిడాలో సంచలనం సృష్టించిన అరుషి హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది.  ఈ హత్యాకేసులో శిక్షను అనుభవిస్తున్న అరుషి తల్లిదండ్రులు రాజేష్, నూపుర్ తల్వార్ లను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఘజియాబాద్ లో శిక్షను అనుభవిస్తున్న వారిని వెంటనే విడుదల చేయాలని సూచించింది. 
ఈ కేసులో సిబిఐ సరైన ఆదారాలను సేకరించలేదని కోర్టు పేర్కొంది. ఆరుషిని తల్లిదండ్రులే చంపారన్న ఆరోపనలను నిర్ధారించడానికి ఎలాంటి ఆదారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

అనంతలో తెలుగుతమ్ముళ్ల బాహాబాహి

అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. పార్టీ కార్యక్రమంలో, ఎమ్మెల్యే ఎదురుగానే భాహాభాహీకి దిగారు. దీనికి అడ్డుపడ్డ ఎమ్మెల్యేను కూడా గాయపర్చారు. వివరాల్లోకి వెళితే గుంతకల్లులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా కౌన్సిలర్ గుణశేఖర్, మాజీ ఎంపీటీసీ మస్తానమ్మ వర్గీయుల మధ్య గొడవ ప్రారంభమైంది. చిన్నగా మొదలైన  గొడవ చివరకు పరస్పర దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్థానిక  ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఆయన వారి మద్యలోకి వెళ్లడంతో ఇరు వర్గాల వారు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకువచ్చారు. దీంతో వారిని తప్పించుకోబోయిన క్రమంలో ఆయన కాలికి గాయమైంది. 

బిసి భవన్ ముట్టడి 
 

తెలంగాణ ప్రభుత్వం వెంటనే పెండింగులో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్  బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిసి విద్యార్థులు బిసి భవన్ ను ముట్టడించారు. బిసి భవన్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులు చేపడుతున్న ఈ నిరసనకు తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్లు  జాతీయ బిసి సంఘం అద్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ఫెండింగ్ లో వున్న 1400  కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన రిమంబర్స్మెంట్ పథకాన్ని సరిగ్గా అమలు చేసి విద్యార్థులను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి సూచించారు.
  

ఏపి లో డిసెంబర్ నుంచి నిరుద్యోగ భృతి

ఎపి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పీజీ విద్యార్హత గల వారికి రూ.2 వేలు, డిగ్రీ వారికి రూ. 1500, పదో తరగతి వారికి రూ.1000 అందించనున్నట్లు సమాచారం. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీనిపై ఏపి ప్రభుత్వం త్వరలో విధి విధానాలు  విడుదలచేయనున్నట్లు సమాచారం. నిరుద్యోగులకు ఉపాధి లభించే వరకు ఈ భృతిని అందించనుంది.  

ప్రేమించిన యువతిపైనే కత్తితో దాడికిదిగిన ప్రియుడు (వీడియో)

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి లోని స్పిన్నింగ్ మిల్లులో  ఒరిస్సా కు చెందిన కమల్ కాంత్ , రికీరాణి లు పనిచేస్తున్నారు. వీరు గత మూడు సంవత్సరాలుగా  స్పిన్నింగ్ మిల్లులో ఉన్న క్వార్టర్స్ లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో వీరిరువురి మధ్య  కొంతకాలం నుండి ప్రేమ వ్యవహారం నడుస్తోంది.  అయితే పెళ్లి చేసుకుందామన్న కమల్ కాంత్ ప్రతిపాదనను రికీరాణి  నిరాకరించింది.  దీంతో కోపోద్రిక్తుడైన కమల్ కాంత్ బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న ఆమె పై కత్తితో దాడికి చేసి, పరారయ్యాడు. 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై కేసు నమోదుచేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం  యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.  
 

చైతన్య కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

మాదాపూర్ లోని చైతన్య కళాశాల ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ కు చెందిన తోట సంయుక్త అనే యువతి  చైతన్య కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతూ, నీట్ కోచింగ్ తీసుకుంటోంది. అయితే బుదవారం అర్థరాత్రి సమయంలో ఈ యువతి కాలేజి హాస్టల్లో ఉరి వేసుకుంది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వార్డెన్ కు సమాచారం అందించారు. వెంటనే ఆమె స్పందించి ఈ యువతిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే యువతి ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

శ్రీశైలం నుండి నీరు విడుదల (వీడియో)
 

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. వర్షాల ధాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో ఇవాళ ఏపి నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టుకు పూజలు నిర్వహించి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి మరియు తెలంగాణ ఎమ్మెల్యేలు,నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. గేట్లను తన్నుకుంటూ ఉప్పొంగి కిందకు దూకుతున్న జలాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.

కళాశాల యాజమాన్యం వేధింపులకు మరో విద్యార్థిని బలి (వీడియో)

ఉన్నత చదువులు చదివిన యువత క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు హైదరాబాద్ మహానగరంలో ఈ మద్య ఎక్కువయ్యాయి. అలాంటి ఘటనే సురారం కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నర్సింహ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో మౌనిక అనే యువతి నాలుగవ సంవత్సరం చదువుతోంది. అయితే  కాలేజి ఫీజు చెల్లించక పోవడంతో  సిబ్బంది ఆమెను పరీక్ష రాయడానికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి సమయంలో కుటుంబసభ్యులంతా నిద్రపోయాక సీలింగ్ ప్యాన్ కు ఉరెసుకుని ప్రాణాలు వదిలింది.
 చనిపోయేముందు  ఇన్స్టాగ్రామ్ లో "ప్రతి నిమిషం నా జీవితం వరెస్ట్ గా మారింది అంటూ    స్టేటస్ పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

click me!