ఏం సాధించారని ఈ ఆవిర్భావ వేడుకలు

First Published Oct 10, 2017, 11:22 AM IST
Highlights

విశేష వార్తలు

  • హైదరాబాద్ లో నకిలీ దర్శక నిర్మాత అరెస్ట్
  • జిల్లాల ఆవిర్భావ వేడుకలపై ద్వజమెత్తిన మాజీ మంత్రి
  • మలివిడత అమరవీరుల స్పూర్తి యాత్ర పోస్టర్ లాంచింగ్
  • కెసిఆర్ కు సవాల్ విసిరిన రేవంత్   
  • సీఎం కెసిఆర్ పై కోదండరాం సీరియస్
  • జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  • ఐదేళ్ల పాపను నేలకేసి బాదిన కన్న తండ్రి

యువతను మోసగించిన నకిలీ దర్శక నిర్మాత 

 

యువతకు సినిమాల మీద ఉన్న మోజును ఆసరాగా చేసుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ నఖిలీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పై భాధితులు పోలీసులకు పిర్యాధు చేశారు. వివరాల్లోకి వెళితే సామ్రాట్ సింగానియా అనే వ్యక్తి  సినిమాను నిర్మిస్తున్నానని, అందుకోసం నూతన నటులకు అవకాశాలు కల్పిస్తామని పేస్ బుక్ లో ప్రకటన జారీ చేశారు.  ఈ యాడ్ ను చూసి సంప్రదించిన ఓ 12 మంది యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి వారికి సినిమా అవకాశాలు ఇవ్వకుండా వేధించసాగాడు.డబ్బులు తిరిగివ్వమని అడిగితే బెదిరింపులకు దిగడంతో ఏం చేయాలో పాలుపోని బాధితులు కిషన్ బాగ్ పోలీసులను ఆశ్రయించారు. వీరి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టనునన్నట్లు తెలిపారు.

"ఏం సాధించారని ఈ ఆవిర్భావ వేడుకలు"
 

సూర్యాపేట జిల్లా: తెలంగాణ కు స్వతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17 ను విస్మరించి  తెలగాణ ప్రభుత్వం, పనికిమాలిన జిల్లా ఆవిర్భావ దినోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించడంలో ప్రచార ఆర్భాటాల కోసమేనని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఏం సాధించారని ఈ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారో తనకైతే అర్థమవడం లేదని ఎద్దేవా చేశారు.ఈ ఆడంబరాల కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి చివరకు ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు.
అంతే కాకుండా కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను రియల్ వ్యాపారులకు అనుకూలంగా ఉండే చోట నిర్మిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటిని నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 

అమరుల స్ఫూర్తియాత్ర పోస్టర్ లాంచింగ్

అమర వీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ కోదండరాం చేపడుతున్న అమరవీరుల స్పూర్తి ఈ నెల 14 వ తేదీ నుండి ప్రారంభంకానుంది.  ఈ యాత్రకు సంభందించిన వాల్ పోస్టర్ ను స్టేషన్ ఘనపూర్ లో  టీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ ఆవిష్కరించారు. 
గతంలో నిజామాబాద్ లో చేపట్టిన స్పూర్తి యాత్రను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి వరంగల్ జిల్లాలో చేపడుతున్న యాత్ర కు జేఏసి కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో బాగంగా అధికంగా ప్రజలను ఆకర్షించడానికి ఈ పోస్టర్ లతో ఊరూరా ప్రచారం చేయనున్నట్లు జేఏసి సభ్యులు తెలిపారు.   

కేసిఆర్ కు రేవంత్ సెక్రటేరియట్ సవాల్ (వీడియో)
 

తెలంగాణ సీఎం కేసిఆర్ కు టిడిపి నేత రేవంత్ రెడ్డి మరో కొత్త సవాల్ విసిరారు. ఆ సవాల్  ఏంటో మీరే చూడండి, వినండి. ( ఈ సవాల్ ను సీఎం కేసిఆర్ పట్టించుకునే అవకాశం ఉందా?)

తెలంగాణ లో డిఎస్సి పై కదలిక

ఎన్నో రోజులుగా డిఎస్సి నోటిపికేషన్ గురించి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాస్త ఊరట లభించింది.  డిఎస్సి 2017 రూల్స్ ను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిచర్స్ రిక్రూట్ మెంట్ అభ్యర్ధులకు కావల్సిన అర్హతలు, టెట్ వెయిటేజ్,నిభందనలు ఈ జీవో లో సర్కారు పేర్కొంది. కొత్త జిల్లాల ప్రాతిపదికనే ఈ నియామక ప్రక్రియ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పరీక్షను టి ఎస్ పి ఎస్సీ ద్వారా హర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

బాలకార్మికుల విముక్తి 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ పల్లి లో ఓ పరిశ్రమపై ఎస్ వో టి పోలీసులు దాడులు నిర్వహించారు.  గొడ్డు మాంసం ఉత్పత్తులు చేసే పరిశ్రమపై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ పనిచేస్తున్న 9మంది బాల కార్మికలను గుర్తించారు. వారిని విముక్తి కలిగించిన పోలీసులు పరారీలో వున్న పరిశ్రమ యాజమాన్యం కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

విశాఖ భూ కుంభకోణం పై ప్రతిపక్షాలకు లోకేష్ సవాల్ 

విశాఖ భూ కుంభకోణం లో తన పేరును  ప్రతిపక్షాలు అనవసరంగా లాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసినవారు విచారణ చేపడుతున్న సిట్ ఆదారాలు సమర్పిస్తే అయిపోయేది కదా, ఎందుకు సమర్పించలేదు. దమ్ముంటే ఆదారాలు సమర్పించి నిరూపించాలని  ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తమ ఉనికి కోసమే అనవసరంగా ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

 

రియల్ ఎస్టేట్ వ్యాపారానికా కొత్త కలెక్టొరేట్లు

సూర్యాపేట జిల్లా : సూర్యపేట పట్టణానికి సమీపంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా,రియల్ వ్యాపారుల కోసమే ప్రభుత్వం కలెక్టరేట్ భవనాన్ని కుడ కుడ ప్రాంతంలో నిర్మించడానికి ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సూర్యాపేట పట్టణానికి దూరంగా,ఎలాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని ప్రాంతంలో కాకుండా,  పట్టణానికి చేరువలో,ప్రజలకు అందుబాటులో ఉండే నల్లచెరువు వద్ద నిర్మించాలని డిమాండ్ చేశారు.ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయలు కూడా జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయని,దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలంటే  ప్రజలకు అందుబాటులో ఉండాలని,ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చే విధంగా ఉండవద్దని .....ఈ విషయంలో ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి పునరాలోచన చేయాలని  జూలకంటి హితవు పలికారు.   
 

ప్రగతిభవన్ పై కోదండరామ్ సీరియస్ (వీడియో)
 

తెలంగాణ ఉద్యమంలో  కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతను విస్మరించి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రగతి భవన్ లాంటి భవనాలు నిర్మించుకుని విలాసాలు చేస్తున్నారని జేఎసి చైర్మన్ కోదండరాం విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనైనా ఉద్యోగ ప్రకటనలు వేగవంతమవుతాయన్న నిరుద్యోగుల ఆశలు సంవత్సర కాలం గడుస్తున్నా అడియాశలు గానే మిగిలాయని విమర్శించారు. కమీషన్ ల కక్కుర్తితో మిషన్ భగీరథ, సచివాలయ మార్పు వంటి వాటికి ఇస్తున్న ప్రాధాన్యత ఉద్యోగాల భర్తీపై చూపించడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సాధన కోసం జెఎసి చేపట్టిన కొలువులకై కొట్లాట కార్యక్రమంలో పాల్గొనాలని యువతకు కోదండరాం పిలుపునిచ్చారు.  

నిరుద్యోగులకు తీపి కబురు

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిపికేషన్ జారీ చేసింది. జైళ్ల శాఖలో 238 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తింది. జైళ్ల శాఖ లోని డిప్యూటి జైలర్, వార్డెన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ పరీక్షతో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నోటిపికేషన్ పై ఇంకా సమాచారం కావాలంటే www.tsprisons.gov.in వెబ్ సైట్ చూడాలని జైళ్ల శాఖ తెలిపింది. 
 

ట్యాంక్ బండ్ పై టిపిసిసి ధర్నా 

బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా అక్రమ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ టి పిసిసి ఆద్వర్యంలో ట్యాంక్ బండ్ పై ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అతడు ఈ అవినీతి సొమ్మును వెనకేసుకున్నాడని ఆరోపిస్తూ ట్యాంక్ బండ్ పై గల అంబెద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు,పొన్నాల ,దానం,అంజన్ ,అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

కన్న కూతురిపై తండ్రి కర్కశత్వం

హైదరాబాద్ లోని మాదాపూర్ లో దారుణం జరిగింది. కన్న తండ్రే ఓ ఐదేళ్ల పాపను మద్యం మత్తులో నేలకేసి కొట్టాడు. వివరాల్లోకి వెళితే మాదాపూర్ లోని పర్వత నగర్ బస్తీకి చెందిన రామయ్య అనే వ్యక్తి రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే మద్యానికి బానిసైన ఆతడు తరచూ భార్యతో గొడవపడుతుంటాడు. ఎప్పటిలాగే  ఇవాళ కూడా మద్యం సేవించి వచ్చిన అతడు భార్యతో గొడవపడ్డాడు. ఈ కోపంతో  వారి కన్న కూతురు శిరీష అనే చిన్నారిని నేలకేసి బాదాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను బస్తీవాసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాప తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.  

నాలుగు రాష్ట్రాల డిజిపిల సమావేశం

మావోయిస్టుల అణచివేత, రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రత తదితర అంశాలపై విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో నాలుగు రాష్ట్రాల డిజిపిలు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల డిజిపిలు పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశానికి బిఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ అధికారులు కూడా  హాజరయ్యారు.  ఈ నాలుగు రాష్ట్రాల్లో  మావోయిస్టుల ప్రాభల్యం అధికంగా ఉండటం, వీరిని అణచివేయడంలో రాష్ట్రాల మద్య సమన్వయం  లేకపోవడం తధితర అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.   
 

చత్తీస్ ఘడ్ లో ఏడుగురు నక్సల్స్ అరెస్ట్

 

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో భద్రతాబలగాలు ఏడుగురు నక్సలైట్లను అరెస్ట్ చేశాయి. నక్సల్స్ వద్ద ఉన్న మూడు ఐఈడీ బాంబులతోపాటు దేశీయ తుపాకి, మందుగుండ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బేచగావ్ ప్రాంతంలో నక్సల్స్‌ను తలదాచుకున్నట్లు భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో అత్యంత చాకచక్యంగా వలపన్ని మరీ నక్సల్స్ ని  బద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
 

మరో నిరుద్యోగి ఆత్మహత్య

నడుస్తున్న ట్రెయిన్ లోంచి దూకి ఓ యువకుడు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మదనపల్లె మండలం రామాపురానికి చెందిన వేపన వెంకట రమేష్ అనే యువకుడు బిటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన శవాన్ని ఇక్కడే వదిలేయాలని, కర్మకాండలు నిర్వహించవద్దని సూసైడ్ లో నోట్ లో రాసాడు. 
సంఘటన స్థలానికి చేరుకున్న రేల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

click me!