మెట్టుగూడ-బేగంపేట మెట్రో ట్రయల్ రన్ కు సిద్ధం

First Published Oct 9, 2017, 11:05 AM IST
Highlights

విశేష వార్తలు

  • ఎలమంచిలి వద్ద రోడ్డు ప్రమాదం 
  • త్వరలో మెట్టుగూడ-బేగంపేట మెట్రో ట్రయల్ రన్
  • జివిఎంసి అధికారులపై కబ్జాదారుల దాడి
  • బిజెపి శ్రేణుల సిపిఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమం
  • తెలంగాణ డిజిపి ని కలిసిన కంచ ఐలయ్య
  • గొర్రెల పంపిణీ పథకంపై వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి సూచనలు
  • గోద్రా అల్లర్ల కేసులో నిందితులకు శిక్షతగ్గింపు

ఎలమంచిలి వద్ద రోడ్డు ప్రమాదం (వీడియో)

ఎలమంచిలి మండలం కోకిరపల్లి వద్ద రోడ్ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యలమంచిలి నుంచి విశాఖకు వెళుతున్న ఓ బస్సు  బైక్ ని డీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్నముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబం కి చెందినవారు కావడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మీతులు యలమంచిలికి చెందిన వ్యక్తులుగా సమాచారం.
 

నీకూ, నీ ట్రాఫిక్ నియమానికి ఓ దండం

 

మెట్టుగూడ-బేగంపేట మెట్రో ట్రయల్ రన్ కు సిద్ధం

హైదరాబాద్ మెట్రో ప్రారంభం వైపు పరుగులు పెడుతున్నది.  మెట్టుగూడ నుండి బేగంపేట్ వరకు మెట్రో లైన్ నిర్మాణం పూర్తయింది. దీనితో అధికారులు  ట్రయల్ రన్ కు ఏర్పాట్లు పూర్తిచేశారు.25000 వోల్టుల  విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసినట్లు ఎల్ అండ్ టీ  ప్రకటించింది. దీంతో ట్రయల్ రన్ కు మార్గం సుగమం అయిందని అధికారులు తెలిపారు.

అల్ ఖైదాను పెంచిపోషించింది మేమే (వీడియో)
 

అమెరికా ప్రభుత్వ ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పైపెచ్చు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను పెంచి పోషించింది అమెరికానే అని మాజీ విదేశాంగ మంత్రి హిల్లరి క్లింటన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రష్యా లాంటి శత్రు దేశాల్లో అశాంతిని సృష్టించడానికి వీటిని పావులుగా వాడుకుంటున్నట్లు ఆమె  ఆరోపించారు. ఒకవైపు వాటికి దండిగా నిధులు  సమకూరుస్తూ  మరోవైపు ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని ప్రకటనలను చేయడం తగదన్నారు. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని అమెరికా ప్రభుత్వానికి  హెచ్చరించారు.  

విశాఖలో రెచ్చిపోయిన కబ్జారాయుళ్లు

విశాఖపట్నంలో కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్నే కబ్జా చేసారు దుండగులు. అంతటితో ఆగకుండా దీనిపై ప్రశ్నించిన జీవీఎంసీ ఉద్యోగులపై రాళ్ళ దాడికి దిగారు.  వివరాల్లోకి వెళితే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి తేజ, గోవింద్ , వరప్రసాద్ గాజువాక తుంగ్లం ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న నిర్మాణం పనులను ఆపడానికి వెళ్ళారు. అప్పటికే కబ్జాదారుడు అనుచరలతో ప్రభుత్వ స్థలంలో గోడ నిర్మాణం పనులు చేయిస్తున్నారు. అయితే ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న ఈ పనులను ఆపాలని జీవీఎంసీ అధికారి వారిని ఆదేశించారు. దీంతో కబ్జాదారుడితో పాటు అతడి అనుచరులు జీవీఎంసీ ఉద్యోగులపై రాళ్ళ దాడికి దిగారు. ఈ దాడిలో గోవింద్ అనే ఉద్యోగి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిపై జీవీఎంసీ అధికారులు గాజువాక పోలీస్ లకు పిర్యాధు చేయగా వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. 
 

బిజెపి శ్రేణుల సిపిఎం కార్యాలయ ముట్టడి (దృశ్యాలు) 

కేరళ లో సిపిఎం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తల హత్యలను చేయిస్తోందని పేర్కొంటు ఇవాళ తెలంగాణ బిజెపి ఆద్వర్యంతో సిపిఎం కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో  ఆర్టిసి క్రాస్ రోడ్ లోని సిపిఎం కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు బిజెపి ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారు.

 

పోలీసుల రక్షణ కోరిన కంచ ఐలయ్య

వివాదాస్పద పుస్తక రచయిత కంచ ఐలయ్య తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మను కలిసారు. ఆర్య వైశ్యుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనను కాపాడాలని ఆయన డిజిపి ని వేడుకున్నారు. తనపై ఇదివరకే దాడి జరిగిందని, మళ్లీ అలాంటి దాడులే చేయడానికి ఆర్యవైశ్యులు ప్రయత్నిస్తున్నట్లు డిజిపి కి వివరించారు. 
ఆయన  పిర్యాదుపై స్పందించిన డిజిపి ఎక్కడికి వెళ్లాలనుకున్న ముందుగా అక్కడి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వారి రక్షణ లోనే కార్యక్రమాలకు గాని, వ్యక్తిగత పనులకు గాని హాజరుకావాలని డిజిపి ఐలయ్యకు సూచించారు.      
 

అనంతపురంలోనే ట్యాగ్ చేస్తాం : ఆమ్రపాలి (వీడియో)

గొర్రెల పంపిణీ పథకం గురించి లబ్ధిదారులకు వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి పలు సూచనలు చేశారు. రెండవ విడతలో గొర్రెలను అనంతపురం నుంచి తీసుకువస్తున్నామని, వాటికి అక్కడే ట్యాగింగ్, ఇన్సూరెన్స్ చేసి ఇక్కడికి తీసుకువస్తామని వివరించారు. దీనికి సంఘాలన్నీ సహకరించాలని, కొంచెం అటూ ఇటుగా అందరికి ఆరోగ్యకరమైన గొర్రెలను అందించడానికే ప్రయత్నిస్తామని తెలిపారు. కానీ అక్కడికి వెళ్లాక నాకు ఈ గొర్రె కావాలి, నేను ఇక్కడ తీసుకోను అంటూ అధాకారులతో లబ్థిదారులు వాదోపవాదాలకు దిగరాదని సూచించారు. మొత్తంగా మొదటివిడత పంపిణీ మాదిరిగానే ఈ విడతలో కూడా అందరికి మంచి జీవాలే వచ్చేలా చూస్తామని కలెక్టర్ ఆమ్రపాలి లబ్దిదారులకు హామీ ఇచ్చారు. 
 

గోద్రా అల్లర్ల నిందితులకు శిక్ష తగ్గింపు

గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్డు నిందితులకు విధించిన శిక్షను తగ్గిస్తూ తీర్పు వెలువరించింది. 11 మంది నిందితుల మరణ శిక్షను  జీవిత ఖైదుగా మారుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
గోద్రా రైలు దహనం కేసును విచారించిన  సిట్ న్యాయస్థానం 2011 లో 31 మందిని దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఇందులో 11 మందికి మరణ శిక్ష, మిగిలిన 20 మందికి యావజ్జీవ కారాగార శిక్షవిధించింది. అయితే మరణశిక్షను సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు శిక్షను తగ్గిస్తూ తుది తీర్పు వెలువరించింది.   
 

వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి

హైదరాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పాతబస్తీ లోని ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. బారీ వర్షం కారణంగా వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడిచాంద్రాయణ గుట్ట అల్ జుబేల్ కాలనీకి చెందిన వహీద్ ఖాన్(60) అనే వ్యక్తి  కొట్టుకుపోయాడు. అయితే ఇవాళ అతడి శవం   ఫలక్ నుమా రైల్వే స్టేషన్ సమీపంలోని నల్లవాగు నాలాలో కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

కేసిఆర్ ను కించపర్చిన కండక్టర్ పై విజిలెన్స్ విచారణ

తెలంగాణ సీఎం కేసీఆర్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాడంటూ ఓ  కండక్టర్ పై ఆర్టీసి అధికారులు విజిలెన్స్ విచారణకు ఆధేశించారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కేసీఆర్ పైనా, టీఎస్ ఆర్టీసి కి వ్యతిరేకంగా  ఫేస్ బుక్, వాట్సాప్ లలో కామెంట్స్ పెడుతున్నాడు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇతడిపై  విజిలెన్స్ విచారణకు ఆర్టీసీ ఆదేశించింది. విచారణ నివేదిక అనంతరం అతడిపై చర్యలు తీసకుంటామని ఆర్టీసి అధికారులు తెలిపారు.
 

తెలంగాణలో మొదలైన లారీల సమ్మె  

తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగిన లారీ యజమానులకు లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వి.శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సమ్మె రెండురోజుల పాటు కొనసాగనుంది. సమ్మె లో భాగంగా కూకట్ పల్లి లోని ట్రక్ పార్కింగ్ ప్రాంతంలో జరుగుతున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
వెంటనే కేంద్ర ప్రభుత్వం లారీ పరిశ్రమను సేవారంగంలో భాగంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్న అమలుచేయాలని,అలాగే పెట్రోల్ ను GST పరిధిలోకి తీసుకురావాలని, అదేవిదంగా పెట్రోల్ ధరలను రోజు వారీ మార్పును తొలగించి ఒకే ధరను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 

ఇందిరాపార్కు నుండి ప్రారంభమైన బీజేపి ర్యాలి
 

కేరళ రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ,ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్యలకు నిరసనగా తెలంగాణ బిజేపి ఆద్వర్యంతో ఇందిరాపార్కు నుంచి ర్యాలీ ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని సిపిఎం కార్యాలయం వరకు తలపెట్టిన ర్యాలి ప్రారంభమైంది. ఈ ర్యాలీ లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు నగరంలోని అందరు బిజేపి ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ,  పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   
ఈ సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరక్కుండా బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

సినీనటుడు రాజశేఖర్ అరెస్ట్ (వీడియో)

 రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ పై హీరో రాజశేఖర్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ  ఎదురుగా వెళుతున్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏలాంటి హాని జరగనప్పటికి కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రాజశేఖర్ ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడేమో అన్న అనుమానంతో పోలీస్ స్టేషన్ కు తరలించి బ్రిత్ ఎనలైజర్ తో తనిఖీ చేశారు. దీంట్లో మద్యం సేవించలేదని తేలింది. కేవలం వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును రాజశేఖర్ ఒక్కడే ఉన్నాడు. తన తల్లి చనిపోయిన డిప్రెషన్ లో వెళుతుంటే ఇలా జరిగిందని పోలీసులకు రాజశేఖర్ వివరించాడు.
 

"త్వరలో సిద్దిపేట కలెక్టరేట్ భవనం పూర్తిచేస్తాం"

గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని దుద్దేడ గ్రామ‌ శివారులో నిర్మించనున్న సిద్దిపేట కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు.  వీలైనంత తొందరగా కలెక్టరేట్ భవనాన్ని పూర్తి చేస్తామని ఈ సంధర్బంగా హరిష్ రావ్ హామీ ఇచ్చారు.  అనంతరం ఆయన మోడ‌ల్ రైతు మార్కేట్ ను సంద‌ర్శించి, రైతులతో కొద్దిసేపు మచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుకుని వాటిని పరిష్కరించాలని హరిష్ మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో మంత్రితో పాటు ప్ర‌భుత్వ స‌ల‌హ‌దారు వివేక్ , రోడ్డు డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ చైర్మ‌న్  తూముకుంట నర్సారెడ్డి,  జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లు ఉన్నారు.
 

మహిళపై అధికార పార్టీ ఎమ్మెల్సీ దాడి
 

అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన నాంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పారుఖ్ హుస్సెన్ నాంపల్లి లో ఓ  అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. అయితే అతడు గత ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. దీంతో ఇంటి యజమానురాలైన అంతుల్ వాసే అనే ఎన్నారై మహిళ అద్దె గురించి గట్టిగా అడగ్గా పారుఖ్ ఆమెపై దౌర్జన్యానికి దిగాడు. 
ఇల్లు ఖాలీ చేయాలని అడిగినందుకు ఫరూఖ్ తనపై దుర్భాషలాడుతూ చెప్పుతో దాడి చేశాడని పేర్కొంటూ ఆ మహిళ  నాంపల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో  పారుఖ్ హుస్సెన్ పై కేసు  నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లా  కీసర మండలం అంకిరెడ్డి పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని  డిజిటల్ ఫ్యాక్టరీ లో బారీగా మంటలు చెలరేగి, ప్యాక్టరీలోని సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం సుమారుగా 10 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.   షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు మొదలై ప్యాక్టరీ అంత వ్యాపించిన్టలు అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!