ఈ ఆంధ్రాపోలీస్ ఏం చేశాడో తెలుసా (వీడియో)

Published : Oct 08, 2017, 01:39 PM ISTUpdated : Mar 24, 2018, 12:06 PM IST
ఈ ఆంధ్రాపోలీస్ ఏం చేశాడో తెలుసా (వీడియో)

సారాంశం

మద్యం మత్తులో విధులకు హాజరైన కానిస్టెబుల్ అదే బత్తులో మాక్ డ్రిల్ నవ్వులు పూయిస్తున్న వీడియో

 
 విశాఖ జిల్లా పెదగంగ్యాడ ఫైర్ స్టేష‌న్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మ‌ద్యం మ‌త్తులో విధుల‌కు హ‌జ‌రై హంగామా చేశాడు.  ఫుల్లుగా మందు కొట్టి రావ‌డ‌మే కాకుండా ఫై అదికారులతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. అంతేకాదు మాక్ డ్రిల్ లో ఊగిపోతూ మ‌త్తులో జోగిపోతు కాసేపు న‌వ్వులు పంచాడు. ఈ వీడియో చూస్తే తోటి సిబ్బంది సరదాగ ఆటపట్టించడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కనిపిస్తోంది. అతడిని పక్కకుతీసుకెళ్లి కూర్చోబెట్టినా అతడి హంగామా అలాగే కొనసాగింది.
 అయితే ఈ తతంగం  హ‌న్మ‌కొండ‌లోని ఫైర్ స్టేష‌న్ లో జరిగినట్లు ప్రచారం జరిగింది.కానీ ఇది జరిగింది మాత్రం విశాఖ జిల్లా పెదగంగ్యాడ లోని ఫైర్ స్టేషన్ లో.  ఈ విషయం సూచనలిస్తున్న పోలీస్ పక్కన ఉన్న బోర్డును చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
  ఈ  తాగుబోతు కానిస్టేబుల్ చేసిన హంగామాను తోటి సిబ్బందిలో ఎవరో వీడియో తీసిన సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవ‌డంతో ఈ వ్య‌వ‌హ‌రం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  ఇప్పుడీ వీడియో వైరల్ గా మారుతోంది.       

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)