ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Sep 15, 2017, 10:56 AM IST
Highlights

విశేష వార్తలు

  • కొరియా సూపర్ సీరిస్ లో సెమి ఫైనల్ కు చేరిన.పీవి సింధు  
  • సూర్యాపేటలో బీజేపి ఆందోళన కార్యక్రమం
  • సాంఘీక సంక్షెమ బోర్డు ఆద్వర్యంలో ఈ నెల 21 తేదీన  బతుకమ్మ  వేడుకలు ​
  • ఈ నెల 21 వ తేదీన  సాంఘిక సంక్షేమ బోర్డు ఆద్వర్యంలో బతుకమ్మ వేడుకలు 
  • మేడారం జ ాతర ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష 
  • ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డితో దక్షిణాఫ్రికా హై కమిషన్ అధికారుల సమావేశం  

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఇవాళ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో తన కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. ఇందుకోసం ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా తన కారును తానే నడుపుకుంటు వచ్చి కార్యాలయంలో వేలిముద్రలు పెట్టి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, అంతే సాదాసీదాగా వెళ్లిపోయారు. 
 

కొరియా సూపర్ సీరిస్ లో సెమిఫైనల్ కి చేరిన పివి సింధు

కొరియా సూపర్ సీరిస్ లో పీవి సింధు సెమి ఫైనల్ కు దూసుకుపోయింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి మినత్స మితానిని పై 21-19, 16-21, 21-10 తేడాతో విజయం సాధించింది.  మొదటి సెట్ లో గెలిచిన సింధు, రెండో సెట్ ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్ లో ప్రత్యర్ధిని అసలు  దరిదాపులోకి రానివ్వకుండా చేసి భారీ తేడాతో గెలిచింది.  

సూర్యాపేటలో బీజేపి ఆందోళన కార్యక్రమం

సూర్యాపేట జిల్లాలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఆందోళనకు దిగింది. అదే విధంగా  రైతు సహకార సమితిల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 39 ను ఉపసవరించుకోవాలి డిమాండ్ చేస్తూ  ఆర్డివో ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావులతో పాటు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.                        

రెండాకుల గుర్తుపై నిర్ణయం తీసుకొండి

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తును ఎవరికి కేటాయించాలన్న దానిపై వచ్చే నెల 31 వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ గుర్తు కోసం  సీఎం పళని స్వామి మరియు  దినకరన్ వర్గాలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన దర్మాసనం పార్టీ గుర్తు ఎవరికి చెందుతుందన్న దానిపై స్పష్టత ఇచ్చి, సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది.
 

సాంఘిక సంక్షేమ బోర్డు ఆద్వర్యంలో బతుకమ్మ వేడుకలు 

రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు  ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ సంబరాల వాల్ ఫోస్టర్ ను తెలంగాణ జాగృతి అద్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత  ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి‌న భాద్యత అందరిపై ఉందని, ఈ సారి నిర్వహించే బతుకమ్మ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని కవిత పిలుపునిచ్చారు. బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత తెలిపారు. నాంపల్లి గగన్ విహార్ లోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు కార్యాలయం ఆవరణలో ఈ నెల 21న పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. 
 

మజ్లిస్ పార్టీకి బయపడుతున్న కేసిఆర్

మజ్లిస్ పార్టీకి బయపడే తెలంగాణ సర్కారు విమోజక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకడుగు వేస్తోందని భీజేపి శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. మజ్లీస్ కు వత్తాసు పలుకుతున్న టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ కి పట్టిన గతే పడుతుందని ఎద్దేవా చేశారు.  
సైదాబాద్ లో బిజెపి ఆద్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్యదితిగా హాజరై  ప్రసంగించారు. నిజాంకు వ్యతిరేఖంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం అన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవన్ని ప్రభుత్వం అధికారంగా నిర్వహించకుంటే, తామే 17 వ తేదీన గ్రామ , గ్రామాన జాతీయ జెండాను ఎగరవేస్తామని హెచ్చరించారు.
 

దళితులపై దాడులకు వ్యతిరేకంగా సిరిసిల్లలో కాంగ్రెస్ ధర్నా

సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు జరగడం సిగ్గుచేటని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు అన్నారు. ఈ దాడులకు శృతిమించకుండా  చూడాల్సిక సర్కారే దీనికి సహకరిస్తున్నదని విమర్శించారు.  నేరెళ్ల భాధితులకు న్యాయం చేయని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిరిసిల్ల లో నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు  హనుమంత రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయం తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డితో దక్షిణాఫ్రికా హై కమిషన్ అధికారుల సమావేశం

దేశంలో హెల్త్ హబ్ గా మారిన హైద్రాబాద్ లో వైద్య ఆరోగ్యం విషయంలో అవలంబిస్తున్న మంచి పద్ధతులను  తెలుసుకుని, తమ దేశంలో వీటిని అమలుపర్చడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని దక్షిణాఫ్రికా హై కమిషన్ అధికారులు తెలిపారు. వీరు ఇవాళ తెలంగాణ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ని క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు వైద్య రంగంలో శాస్త్ర, సాంకేతికతను వినియోగించుకోడంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా ల మధ్య పరస్పరం సహకారించుకోవాలని నిర్ణయించారు. నిమ్స్ లాంటి హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లోని బెస్ట్ మెడికల్ ప్రాక్టీసెస్ ని దక్షిణాఫ్రికా లో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రికి వివరించారు.
తమ దేశ పర్యటనకు రావాలని మంత్రి లక్ష్మారెడ్డి ని దక్షిణాఫ్రికా అధికారులు  ఆహ్వానించగా, సీఎం కేసీఆర్ తో చర్చించి, దక్షిణాఫ్రికా ని సందర్శిస్తామని వారికి హామీ ఇచ్చారు.  
ఈ  సమావేశంలో దక్షిణాఫ్రికా డిప్యూటీ హై కమిషనర్ బెన్ జోబర్ట్ , రికార్డో ఆండ్రూస్, ఎర్నెస్టి గోర్డన్,థాపెలో మస్తా,లతో పాటు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
 

జాతీయ పండగగా మేడారం జాతరను గుర్తించాలి

జయశంకర్ జిల్లా మేడారంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఏర్పాట్లపై స్థానిక క్యాంపు ఆఫీసులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని  తీర్మానం చేసారు.
అనంతరం ఉపముఖ్యమంత్రి వన దేవతలను దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ సితారాం నాయక్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్లు మురళి ,అమ్రపాలి, ప్రశాంత్ పటేల్. జిల్లా ఎస్పీ భాస్కరన్, వరంగల్ సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం షురూ

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా పొందుపర్చిన వివరాల ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ. 4000 ముందస్తు పెట్టుబడిని రైతులకు అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో  "రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను" ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్15 నుండి డిసెంబర్15 వరకు 90 రోజులు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని 10,733  రెవెన్యూ గ్రామాల్లో, 1343 బృందాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ రికార్డుల ప్రక్షాలన ద్వారా అమ్మకం‌, కొనుగోలు, వారసత్వ భూములకు సంబందించి గ్రామాల్లో వివాదాలకు  ముగింపు పలకనున్నట్లు మంత్రి తెలిపారు.
 

చార్మినార్ వద్ద "స్వచ్చతా హై సేవా" కార్యక్రమం (వీడియో)

చార్మినార్ వద్ద  క్లీన్ లైన్స్  డ్రైవ్ పేరుతో "స్వచ్ఛతా హై సేవా" కార్యక్రమాన్ని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం  ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యటక ప్రదేశాలలో పరిసరాల  పరిశుభ్రత పాటించాలని, వచ్చిన పర్యాటకుల ను గౌరవించాలని  స్థానికులకు, షాపుల నిర్వాహకులకు  సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కమిషనర్ సునీత భగవత్, టూరిజం  ఎండి క్రిస్టినా, ఇండియా టూరిజం  అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ రెడ్డి,  జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, చార్మినార్ కార్పొరేటర్ సోహైల్ కాద్రి తదితరులు పాల్గొన్నారు.

click me!