ఏషియానెట్-తెలుగు క్రైమ్ న్యూస్

First Published Sep 15, 2017, 11:18 AM IST
Highlights

విశేష వార్తలు

  • మైలవరం ప్రాజెక్టులో దూకి ఐదుగురి ఆత్మహత్య
  • హైదరాబాద్ లో ఉత్తరప్రదేశ్ దోపిడి దొంగల ముఠా అరెస్ట్
  • ఇడుపులపాయ  ట్రిపుల్‌ ఐటీలో  విద్యార్థులు ఆందోళన 
  • మిర్యాలగూడకు చెందిన  డాక్టర్ అచ్యుతరెడ్డి అమెరికాలో దారుణ హత్య

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినుల రాస్తారోకో

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు  హాస్టల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ  రోడ్డెక్కారు.  హాస్టల్ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదని, అందువల్లే రోడ్డెక్కి రాస్తారోకో చేయాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోయారు. సమాచారం లేకుండానే నీటి సరపరా, కరెంట్ సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూనివర్సిటి ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. 
 

బైసన్ పోలో గ్రౌండ్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన (వీడియో) 

 

నూతన సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రౌండ్ వద్దకు  కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు అనిల్ కుమార్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 

మైలవరం ప్రాజెక్టులో దూకి ఐదుగురి ఆత్మహత్య 

అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన  వహీద్ తో పాటు అతడి ఇద్దరు బార్యలు, ఇద్దరు కుమార్తెలు మైలవరం ప్రజెక్టలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతానికి మూడు మృతదేహాలు లభ్యమవగా, మరో రెండు మృతదేహాల కోసం గజ ఈతగాళ్లతో అధికారులు వెతికిస్తున్నారు. 

సంపులో పడ్డ ఆవు

హైదరాబాద్ : ఆనంద్ బాగ్ లోని శారదా నగర్ లో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సంపులో ఆవు పడిపోయింది. సంపులో నుండి  గోవు బయటకు తీయడానికి యజమాని తో పాటు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.  
 

నగరంలో కంజర్ గ్యాంగ్ అరెస్టు

రాచకొండ: గత నెల 20వ తేదీ న హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిదిలోన 4కోట్ల విలువైన సిగరెట్ లోడ్ తో కూడిన లారీని దొంగొలించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన    రాజారామ్, హుకుం సింగ్,సునిల్,రాజా బాబు లను రాచకోండ పోలీసులు అదుపులోకి తిసుకున్నారు. వారి వద్ద గల 4 లారీలను సీజ్ చెసారు.
నిందితులకు వివరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియాకు తెలుపుతూ,  పరారిలో మరో 20మంది నిందితులు ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. నగరంలో కంజర్ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారని, మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ సబ్యులు అత్యంత క్రూరులని తెలిపారు.  వారిని పట్టుకున్న పోలీస్ అధికారులను సిపి అభినందించారు.
 

ఇడుపులపాయ  ట్రిపుల్‌ ఐటీలో  విద్యార్థులు ఆందోళన 
 

  కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో  విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.  భోజనం సరిగ్గా ఉండటం లేదంటూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి మెస్‌ల ముందు బైఠాయించారు. అపరిశుభ్రమైన భోజనం తిని, తరచూ అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా దీనిపై అధికారులు దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
 

యువకులపై మేడిపల్లి పోలీసుల జులుం  

అమాయాకులైన ఇద్దరు యువకులను పోలీసులు చితకబాదిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే రామంతాపుర్ కు చె౦దిన ఓ మహిళ తన భర్త పై మేడిపల్లి స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఈ దంపతుల ముగ్గురు మైనర్ పిల్లలను రాత్రి సమయంలో స్టేషన్‌ లో ఉంచుకున్నారు. ఆకలికి తట్టుకోలేక  పిల్లలు తమ సమీప బంధువైన మల్లికార్జున్ కు ఫోన్ చేసి రమ్మన్నారు.  అతడు తన స్నేహితుడు చార్లెస్ తో కలిసి మేడిపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్ళారు.
అయితే పిల్లల కోసం వీరు రావడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఎస్సై వెంకటరెడ్డి, వీరిపై దూషనకు దిగాడు.  దీంతో బిత్తరపోయి యువకులు  తామేం తప్పు చేశామని ఆయనను ఎదురు ప్రశ్నించారు. దీంతో కోపానికి గురైన ఎస్ఐ ఇద్దరు యువకులను ప్లాస్టిక్ బెల్ట్  తో  చితకబాదారు. 
నిబంధనలకు విరుద్ధంగా మైనర్లను రాత్రిపూట స్టేషన్ లో బంధించి తమను అన్యాయంగా కొట్టిన ఎస్ఐపై చర్య తీసుకోవాలని మల్లికార్జున సీఐ జగన్నాథ రెడ్డి ని కోరగా ,ఆయన వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.   
 

అమెరికాలో నల్గొండవాసి దారుణ హత్య

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైకియాట్రిక్ డాక్టర్ అచ్యుతరెడ్డి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు.  కాన్సాస్ లోని అతడి సొంత క్లినిక్‌లోనే గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురై మృతిచెందాడు.  నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి  అచ్యుత్‌రెడ్డి కి సంభందించిన హోలిస్టిక్ క్లినిక్‌ కి వచ్చి  ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో దుండగుడు ఒక్కసారిగా కత్తి తీసి పలుమార్లు అచ్యుతరెడ్డి ని పొడిచాడు. దీంతో  అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 
ఘటన జరిగిన కొద్ది సమయంలోనే నిందితుడిని స్థానిక కంట్రీ క్లబ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే    హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

click me!