కొండపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

First Published Sep 29, 2017, 11:29 AM IST
Highlights

విశేష వార్తలు

  • కొండపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
  • నగరంలో మాదకద్రవ్యాల సరఫరా ముఠా సభ్యుడి అరెస్ట్
  • రాజస్థాన్ లోని బికనీర్ లో యువతిపై సామూహిక అత్యాచారం 
  • ముంబై దుర్ఘటనలో 27 కి చేరిన మృతుల సంఖ్య
  • హీరోయిన్ విద్యాబాలన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాద

దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుప‌త్రి పై కేసు నమోదు

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలుడికి  నిర్లక్ష్యంగా వైద్యం చేశారని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుప‌త్రి వర్గాలపై  కేసు న‌మోదైంది. వివరాల్లోకి వెళితే  వంశీ అనే 12 ఏళ్ల బాలుడికి మూర్చవ్యాధి రావ‌డంతో చికిత్స కోసం నల్లకుంట లోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుప‌త్రి ని ఆశ్రయించారు. అయితే  ఆసుప‌త్రి సిబ్బంది అతడికి ఫంగ‌స్ (బూజు) తో కూడిన సెలైన్‌ బాటిల్ ఎక్కించడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో ఆగ్రహానికి లోనైన బాధితులు న‌ల్ల‌కుంట పిఎస్‌లో హస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం పై  ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు.
 

కొండపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

కొ౦డపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిప్టీ ల్యాబ్ కంపెనీ ప్రమాదవశాత్తు మంటలు ప్రారంభమై ఎగసిపడుతున్నాయి. ఈ  మ౦టలకు నిప్టీ ల్యాబ్ గోడౌన్ లోని కెమికల్స్ కూడా తోడవడంతో మంటలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో దట్టంగా పొగలు అలుముకుని  పారిశ్రామిక వాడ మొత్తం ఆ౦ధోళనకర౦గా మారింది. గోడౌన్లో భారీ ఎత్తున రసాయనాలు ఉండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆ౦దోళనలో కార్మికులు బిక్కుబిక్కుమంటున్నారు.
 

నగరంలో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నిషేధిత మత్తు పదార్దమైన అల్పోజోరం  విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఎక్సైజ్  ఎన్ పోర్స్ మెంట్ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 460 కేజీల అల్పోజోరం సీజ్  చేసినట్లు ఎక్సైజ్  ఎన్ పోర్స్ మెంట్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి మీడియాకు తెలిపారు. దీని విలువ సుమారు 4 కోట్ల 60 లక్షలు ఉంటుందని వివరించారు. తెలంగాణ  వ్యాప్తంగా ఈ ముఠా మత్తు మందును సప్లై చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ముఠాలో ప్రధాన నిందితులుగా సిపి రెడ్డి, అతని కొడుకు సిద్దార్ధ రెడ్డిలు ఉండగా వారికి సహయంగా కల్యాణ్ రామ్,సెల్వ కుమార్ లు ఉన్నట్లుగా పోలీసులుగుర్తించారు.అయితే ప్రధాన నిందితుడు సిద్దార్ధ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.
 

నయీమ్ అనుచరుడి హత్యకు భారీ స్కెచ్

యాదాద్రి భువనగిరిజిల్లా : నయీమ్ అనుచరుడు కొనాపూర్ శంకర్ ను హత్య చెయ్యడానికి పథకం రచన చేసిన ప్రదాన నిందితుడు కొమరెల్లి ప్రదీప్ రెడ్డి తో పాటు అతడికి సహకరించిన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. . పాత కక్షలతో వీరు నయీమ్ అనుచరుడైన కొనాపూర్ శంకర్ హత్యకోసం పెద్ద ఎత్తున మరణాయుధాలు కూడా సమకూర్చకున్నారు. వీరి వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారికి అదుపులోకి తీసుకుని, మారణాయుదాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ దుండగులు పలుమార్లు శంకర్ పై హత్యాయత్నానికి పాల్పడి విఫలమయ్యారని, దీంతో మరోసారి అతడిపై అటాక్ చేయడానికి పథకరచన చేస్తుండగా పట్టుకున్నామని భువనగిరి డిసిపి తెలిపారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు                     

 ఆదికేశవులు నాయుడి మనువడు అరెస్ట్
 

మాజీ టిడిపి చైర్మన్ ఆదికేశవులు నాయుడు మనువడు విష్ణును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే విష్ణు తన స్నేహితులతో కలిసి బెంగళూరులో ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. అయితే దీనిపై సమాచార అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా విష్ణు కారులో గంజాయి దొరికింది. దీంతో పోలీసులు విష్ణు తో పాటు అతడితోపాటు కారులో ఉన్న నటుడు ప్రజ్వల్, దిగంత్ లను అరెస్టె చేశారు

యువతిపై సామూహిక అత్యాచారం
 

రాజస్థాన్ లోని బికనీర్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డిల్లీకి చెందిన ఓ యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సామూహికం అంటే ొకరిద్దరు కాదు ఏకంగా 20 మంది అత్యాచారం చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మొదట ఈ యువతిని అపహరించిన ఇద్దరు దుండగులు ప్రయాణంలో ఉన్న కారులోనూ అత్యాచారం చేశారు. తర్వాత ఓ గ్రామానికి తీసుకెళ్లి మరికొంత మందితో అత్యాచారం చేయించి రాత్రి మొత్తం ఆముకు నరకం చూపించారు.అత్యాచారం అనంతరం యువతిని బికనీర్ లో వదిలిపెట్టి దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు. అలాగే ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.    

ముంబై దుర్ఘటనలో 27 కి చేరిన మృతుల సంఖ్య

ముంబై లోని ఎల్ఫిన్ స్టోన్  రైల్వే స్టేషన్ లోని తొక్కిసలాటలో మృతుల సంఖ్య 27 కి చేరింది. వర్షం కారణంగా రైల్వే స్టేషన్ లోకి చేరిన ప్రయాణికులతో పుటోవర్ బ్రిడ్జి కూలడం, ఆ తర్వాత తొక్కిసలాట జరగడంతో ఈ ఘోర ధుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని సమాచారం.

విద్యాబాలన్ తృటిలో తప్పిన ప్రమాదం

ముంబయి : బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాంద్రాకు వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటన నుంచి విద్యాబాలన్, ఆమె డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఏడాది విద్యాబాలన్ నటించిన బేగమ్ జాన్ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆమె తుమారీ సులు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేశ్ త్రివేణి దర్శకుడు.

ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ప్రమాదంలో 22కు చేరిన మృతుల సంఖ్య

 

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఈ ఘటన స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ప్రయాణికులు నడిచే వంతెనపై ఈ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ స్టేషన్‌లో లోకల్ రైళ్లు ఎక్కువగా ఆగుతాయి. వంతెనపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. షార్ట్ సర్కూట్ జరిగిందని, వంతెన కూలిపోతుందని కొందరు కేకలు వేయడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు ఒకరినొకరు తోచుకూంటూ పరుగెత్తారు. దీంతో  కొందరు మెట్ల మీద జారి పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

ముంబై ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 15 మంది మృతి (వీడియో)
 

ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ భారీ వర్షం కారణంగా తొక్కిసలాట జరిగి 15 మంది మత్యువాత పడ్డారు. మరో 50 మందికి తీవ్ర గాయాలవగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే భారీ వర్షం కారణంగా రైల్వేస్టేషన్ లోకి చేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగి ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకోవడంతో అది కూలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి లోనై పరుగుతీయడంతో తొక్కిసలాట జరిగింది.అయితే ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

నార్త్ జోన్ పరిధిలో వరుసగా  చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దొంగలముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.  ఈ ముఠాలో ముగ్గురు స్నాచర్లు, ఓ రిసివర్ మొత్తం నలుగురు సభ్యులు పట్టబడ్డారు. వీరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గాంధీ నగర్ పోలీసులకు అప్పగించారు.వీరి నుండి 6 తులాల బంగారం,ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ నిందితులు బేగం బజార్ కి చెందిన అక్షయ్ శర్మ, యాకుత్ పుర ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అక్బర్ పాషా, సైదాబాద్కు చెందిన మొహమ్మద్ అహ్మద్ మెయిన్ ఉద్దీన్ దావూద్, బజార్ ఘాట్ కు చెందిన  ఖాజా పరిదుద్దిన్ గా పోలీసులు గుర్తించారు.

click me!