జంటనగరాల్లో భారీ వర్షం

Published : Sep 28, 2017, 10:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
జంటనగరాల్లో భారీ వర్షం

సారాంశం

హైదరాబాద్ లో భారీ వర్షం తడిసిముద్దవుతున్న నగర ప్రజలు ఇంకా పెద్ద వర్షాలు కురిసే అవకాశం

 నగరాన్ని ఇవాళ సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. సిటీలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లపైకి వరద నీరు రావడంతో వాహనదారులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు  విస్తరించడంతో భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించింది.

హైదారాబాద్‌లో ఇంకా  పెద్ద వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హబ్సీగూడ, తార్నాక, నాచారం, పెద అంబర్‌ పేట్‌, ముషీరాబాద్‌, నారాయణ గూడ, ట్యాంక్‌ బండ్, ఎల్‌బీ నగర్‌  ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి తోడు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఇక మేడ్చల్‌ జిల్లాలోని కీసర, నాగారం, దమ్మాయిగూడ, కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, ఈసీఐఎల్‌, ఏఎస్‌ రావు నగర్‌, నేరేడ్ మెట్ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)