
వ్యవసాయంలో యాంత్రీకరణ అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ...నవంబర్ 16,17,18 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ ఆగ్రో టెక్నాలజీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మిలిందా గేట్స్ పౌండేషన్ తో ఈ వ్యవసాయ యాంత్రీకరణ అంశంపై ఒప్పందం కుదుర్చుకుంటామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు గేట్స్ పౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ హాజరవుతారని మంత్రి తెలిపారు. రైతులకు సాంకేతికత అందించడంలో తాము అగ్రస్థానంలో ఉండటం ఆనందంగా ఉందని సోమిరెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశం సంధర్భంగా సిఎం కేసిఆర్ జర్నలిస్టులకు శఉభ వార్త చెప్పారు. నెలరోజుల్లోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ విషయంపై దసరా అయిపోగానే మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో సమావేశమైతానని కేసిఆర్ చెప్పారు. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టు పెద్దలతో దీనిపై మాట్లాడామని, స్థలాలు కూడా చూసి పెట్టామని, నెల రోజులలోపే జర్నలిస్టులందరికీ ఇంటి జాగాలు ఇస్తామని సీఎం తెలిపారు.జర్నలిస్టుల్లో ఉన్న అన్ని కేటగిరీ వాళ్లకు ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కమీషన్ల కోసమే బతుకమ్మ చీరల పంపిణీ జరిగిందని, ఈ కమీషన్లు ఎవరెవరికి అందాయో ప్రజలకు తెలుసని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలి ప్రభుత్వాన్ని విబర్శించారు. ఇవాళ ఆయన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ..ప్రభుత్వం తమ అనుకూల సంఘాల వారిని ప్రలోభపెడుతున్నారని అన్నారు. అలాగే ముస్లింలకు 12 వ శాతం రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాలని షబ్బిర్ అలీ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడటానికి వ్యూహాలు రచిస్తోంది. అందులోభాగంగా ఇతరపార్టీల్లోని పలువురు కీలక నేతలను వైసిపిలోకి ఆహ్వానిస్తోంది. ఇవాళ వైసిపి అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంపి చిమటా సాంబు,పిడిసిసి బ్యాంక్ డైరెక్టర్ గడ్డం శ్రీనివాస్, వేటపాలెం టీడిపి మాజీ అద్యక్షుడు కర్ణ శ్రీనివాసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారి రాకతో ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతమైందని ఈ సందర్భంగా జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారు మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. భక్తులు తెల్లవారుజామునుంచే విశేష రూపంలోని అమ్మవారిని దర్శించుకోడానికి బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రేపు విజయదశమి రోజున సామాన్య భక్తులతో పాటు భవాని దీలో ఉన్నవారు కూడా అధిక సంఖ్యలో విచ్చేయనున్నారు కావున ఆలయ అధికారులు ముందుగానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా పేర్చిన బతుకమ్మ లను ఇంటిలో నుంచి సిఎం సతీమణి కల్వకుంట్ల శోభ , సీఎం కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెరో బతుకమ్మ ను బయటకు తీసుకుని వచ్చారు. ఇంటిముందు బతుకమ్మ లను పెట్టి ఇంట్లో పనిచేసే మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ హోరెత్తించారు. ఎంపీ కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్సాహ పరిచారు.