దేశ రాజధాని డిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం

First Published Sep 23, 2017, 10:52 AM IST
Highlights

విశేష వార్తలు

  • మొహాలీలో సీనియర్ జర్నలిస్టును హత్య చేసిన దుండగులు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళల మృతి
  • రిమాండ్ ఖైదీలను చితకబాదినందుకు ఏసిపి సందీప్ కు కోర్టు నోటీసులు
  • హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని

దేశ రాజధాని డిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం

దేశ రాజధాని డిల్లీలో మరోసారి భయానక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. నిర్భయ అత్యాచారం తరహాలో యువతిని కిడ్నాప్ చేసి కదులుతున్న కారులో దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న గుర్తుతెలియని దుండగులు అదే కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు యువతిని హాస్పిటల్ కు తరలించి, దుండగులకోసం గాలింపు చేపట్టారు. 

మొరాలికి 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ :అత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టయిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరాలి ని పోలీసులు హయత్ నగర్ 7వ మెట్రోపాలిటన్ మేజిస్టేట్ కోర్టు లో హాజరుపర్చారు. అతడికి అక్టోబర్ 6 వరకు అంటే 14 రోజులు జ్యూడిషియల్  రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ ఆదేశాలతో మొరాలిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

స్వైన్ ప్లూ తో గాంధీ లో ముగ్గురు రోగుల మృతి
 

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.యాదాద్రి జిల్లా  లింగరాజపల్లి కి చెందిన స్వరూప(46), భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన బాబురావు(50), హన్మకొండ కు చెందిన సాజిదా సుల్తానా(48)లు మృతిచెందిన వారిలో ఉన్నారు. మరో 7 గురు స్వైన్ ఫ్లూ తో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణాలతో కలుపుకుంటే సంవత్సర కాలంలో గాంధీ ఆసుపత్రిలో 39 మంది స్వైన్ ఫ్లూ వల్ల మృతి చెందడం కొంత ఆందోళన కల్గించే అంశం.

ఎసిబి వలలో ఎమ్మార్వో 

ఆదిలాబాద్‌ జిల్లా రెబ్బెన మండల ఎమ్మార్వో లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డాడు.  భూ రికార్డుల  కోసం మండలానికి చెందిన శంకర్‌ అనే రైతు ను తహసిల్దార్ రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసిబి సూచన మేరకు ఎమ్మార్వోకు మండల కార్యాలయంలో డబ్బులు అందిస్తుండగా డీఎస్పీ సుదర్శన్‌ ఆద్వర్యంలో కాపుగాచి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి డబ్బును స్వాదీనం చేసుకున్న అధికారులు ఎమ్మార్వోను విచారిస్తున్నారు. 

మొహాలీలో సీనియర్ జర్నలిస్ట్ హత్య  

మొహాలిలో సీనియర్ జర్నలిస్ట్ తో పాటు అతడి తల్లిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.  సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్  తో పాటు అతని తల్లి గురుచరణ్ కౌర్ ని దుండగులు వారి నివాసం వద్దే హత్య చేశారు.  ఈ జంట హత్యలను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఖండించారు. ఈ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు నశించాయని విమర్శించారు.

మణప్పురం  గోల్డ్ ఫైనాన్స్ ముందు ఖాతాదారుల ఆందోళన (వీడియో)

కృష్ణాజిల్లా నందిగామ మణప్పురం  గోల్డ్ ఫైనాన్స్ ముందు ఖాతాదారుల ఆందోళనకు దిగారు.  ఈ సంస్థలో బంగారాన్ని తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నామని, ఇపుడు బాకీతీర్చిన బంగారం ఇవ్వకుండా మభ్యపెడుతున్నారంటూ ఖాతాదారులు మణప్పురం  గోల్డ్ ఫైనాన్స్ ఆఫిస్ కు తాళాలు వేసి అందోళన చేస్తున్నారు. ఈసంస్థపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

బోర్డు తిప్పేసిన బోగస్ ఐటీ కంపెనీ 

నిరుద్యోగుల నుంచి ఐటీ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బోగస్ ఐటీ కంపెనీ భాగోతం బెంగళూరు లో బయటపడింది. 50 మంది నిరుద్యోగుల నుంచి సెక్యూరిటీ బిపాజిట్ గా 1.40 లక్షలను వసూలు చేసిన కంపెనీ నిర్వహకులు మొత్తం 7ే లక్షలతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రమాదం, ఇద్దరు మహిళల మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపేట మండలంలో ట్రాక్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాయరాం తండా లో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో 15 మందికి తీవ్రగాయాలవగా సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.  

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిర్మాత కరీం మొరాని

సుప్రీం కోర్టు బెయిల్ ను రద్దు చేయడంతో భాలీవుడ్ నిర్మాత కరీం మొరాని ఇవాళ హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి ముంబై కి చెందిన యువతిపై కరీం ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అతడి చేతిలో మోసపోయిన యువతి సుప్రింకోర్టును ఆశ్రయించడంతో అప్రమత్తమైన కరీం ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఈ ముందస్తు బెయిల్ ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా నిందితుడు కరీంను ఆదేశించింది. దీంతో ఇవాళ  హయత్ నగర్ పోలీస్టేషన్ లో లొంగిపోయిన కరీం మొరాని పై పటు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.   

రిమాండ్ ఖైదీలను చితకబాదిన ఏసిపికి కోర్టు నోటీసులు

ఖైదీలను విచక్షణారహితంగా చితకబాదినందుకు ఏసీపీ సందీప్ కు రంగా రెడ్డి జిల్లా కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే  ఈనెల 17న అర్ధరాత్రి మద్యం మత్తులో ఉప్పల్ లో ముగ్గురు వ్యక్తులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఏసీపీ సందీప్ వద్ద ఉన్న కానిస్టేబుల్, హోంగార్డులపై దాడి చేశారు. దీంతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ కు తరలించాల్సిందిగా ఆదేశించింది. అయితే రిమాండ్ లో ఉన్న తమపై ఏసీపీ సందీప్ తో పాటు ఇతర స్టాఫ్ విచక్షణారహితంగా కొట్టినట్లు నిందితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. వీరి ఫిర్యాదుపై స్పందించిన రంగారెడ్డి కోర్టు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏసిపికి నోటీసులు జారీ చేసింది. 
 

click me!