తణుకులో వింత పెళ్లి

First Published Oct 8, 2017, 11:41 AM IST
Highlights
  • పౌరాణిక వేషధారణలో వధూవరులు
  • పెళ్లి పెద్దలు కూడా
  • ఆంద్రప్రదేశ్ లో వింత వివాహం

పైన కనిపిస్తున్న ఫోటో చూసి ఇదేమైనా పౌరాణిక నాటకంలోని పెళ్లి సన్నివేశం అనుకుంటున్నారా...లేదా ఆకాశరాజు శ్రీనివాసుడు పద్మావతి ల కథ అనుకుంటున్నారా. అదేం కాదండి ఇది నిజంగా జరిగిన ఫెళ్లేనండి. 


వివరాల్లోకి వెళితే ఆంద్రప్రధేశ్ రాష్ట్రంలోని తణుకు దగ్గర గల ఖండవల్లిలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ గ్రామానికి చెందిన  శ్రీధర స్వామి అనే ఒక స్వామీజీ తన కూతురి పెళ్లి ఎప్పటికి గుర్తుండిపోయేలాగ చేయాలన్న ఆలోచన వల్ల జరిగిందే ఈ  వింత పెళ్లి. 


ఫెళ్లికొడుకు శ్రీనివాసుడిగా, పెళ్లి కూతురు పద్మావతి దేవి అలంకరణలో పెళ్లి పీటలపై కూర్చుని ఒక్కటయ్యారు. పెళ్లికి హాజరై ఇది చూసినవారు నిజంగా దేవతల పెళ్లి జరుగుతుందా అన్న ఆశ్అశ్చర్యానికి గురయ్యారు. వధూవరులే కాదు పెళ్లి పెద్దలు కూడా ఇదే పౌరాణిక అలంకరణలో కనిపించి పెళ్లి  జరిపించారు. మొత్తానికి భువిపై దేవతల పెళ్లి జరుగుతుందా అన్నంతలా అంగరంగవైభవంగా ఈ పెళ్లి జరిగింది.        

           

click me!