శరీరానికి అవసరమని అతిగా నీళ్లను తాగుతున్నారా.... అయితే ఈ ప్రమాదంలో పడ్డట్టే!

Published : Feb 23, 2023, 11:03 AM IST
శరీరానికి అవసరమని అతిగా నీళ్లను తాగుతున్నారా.... అయితే ఈ ప్రమాదంలో పడ్డట్టే!

సారాంశం

 సాధారణంగా ఒక వ్యక్తి ఆహారం లేకుండా కొన్ని రోజులపాటు ఉండగలరు కానీ నీరు లేకుండా మాత్రం ఒకరోజు కూడా ఉండలేరు. ఇలా మీరు తాగకుండా ఉండటం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా మనం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే మన శరీరంలో జరిగే జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా మన శరీరానికి నీరు అనేది ఎంతో అవసరం.  

ఈ విధంగా నీటిని బాగా తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలు అన్ని సక్రమంగా జరిగి ఎంతో ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీరు మనకు ఎంతో ఆరోగ్యకరమని, ప్రయోజనకరమని తెలిసి అతిగా తాగటం వల్ల మరెన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మన దాహానికి మించి నీటిని తాగటం వల్ల మన శరీర జీవక్రియలలో మార్పులు చోటు చేసుకుంటాయని తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా మన దాహానికి మించి కాస్త నీటిని ఎక్కువ తీసుకుంటే పర్లేదు కానీ అతిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియలు వాటి పనితీరుపై కాకుండా మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి నీటిని బయటకు పంపించడం పై దృష్టి సారిస్తాయి ఈ క్రమంలోనే అవయవాల పని తీరు మందగిస్తుంది. ఇలా ఎక్కువగా నీటిని తాగటం వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

ఇలా మూత్ర విసర్జనకు వెళ్లడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు వ్యర్థాలు బయటకు వెళ్తాయి. వీటితో పాటు మన శరీర జీవక్రియలకు అవసరమయ్యే సోడియం పొటాషియం వంటి ముఖ్య పోషక లవణాలు కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్లడం వల్ల మన శరీరంలో అవయవాల పనితీరులో వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఇలా మన శరీరంలో నీటితోపాటు లవణాలు కూడా బయటకు వెళ్లడం వల్ల మెదడు నుంచి కండరాలకు వెళ్లాల్సిన ఆదేశాలు సరిగ్గా అందక కండరాలు బిగిసుకుపోతాయి.

శరీర అవసరం కంటే ఎక్కువగా నీటిని తాగటం వల్ల కొన్ని సార్లు ఆ నీళ్లు మన జీవ కణాలలోకి చొచ్చుకపోయి  వాటిని నాశనం చేసే ప్రమాదం ఉంది. దీనినే వాటర్ ఇంటాక్సికేషన్ అని పిలుస్తారు. ఇక ఒకసారి మనం నీటిని తాగేటప్పుడు ఎంత మొత్తంలో నీటిని తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఒకసారి నీటిని తాగినప్పుడు దాదాపు 100 ఎమ్ ఎల్ లేదా మన దాహం తీరే వరకు తాగాలి.ఇలా రోజుకు ఆ వ్యక్తి శరీర బరువును బట్టి రెండు నుంచి మూడున్నర లీటర్ వరకు నీరు తాగడం ఆరోగ్యకరం.

ఇక ఒక వ్యక్తి ఎంత శాతంలో నీటిని తీసుకుంటున్నారు అనేది వారి యూరిన్ బట్టి అర్థమవుతుంది. యూరిన్ ఎక్కువ తెలుపు రంగులో కనుక బయటకు వస్తే మీరును నీటిని అధికంగా తీసుకుంటున్నారని అర్థం. అదేవిధంగా ఎక్కువగా పసుపు రంగులో కనుక యూరిన్ బయటకు వస్తే మీ శరీరానికి నీటి పరిమాణం పూర్తిగా తగ్గిపోయిందని సంకేతం. ఇలా తెలుపు పసుపు రంగులో కాకుండా కొద్దిగా పసుపు రంగులో యూరిన్ కనుక వస్తే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే సంకేతం.

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం