
మన శరీరంలోని రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కలిగే రుగ్మతను డయాబెటిస్ అంటారు. అయితే ఈ వ్యాధి మనకి వచ్చిందని ఎలా నిర్ధారించాలి మనలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయానికి వస్తే..మీరు రోజులో ఎక్కువసార్లు మూత్రానికి కనుక వెళ్తున్నట్లు ఉంటే తప్పనిసరిగా మీరు డయాబెటిస్ బారిన పడ్డారని తెలిపే సంకేతం.
డయాబెటిస్ సమస్యలతో బాధపడే వారిలో తరచూ దాహంగా ఉండటం, త్వరగా నీరసించి పోవడం అంటే లక్షణాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఆకలి మన తగ్గిస్తుంది. ఏది తినాలనిపించదు అలాగే చూపు కూడా కాస్త మసకబారుతుంది.ఇక డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారి కాళ్లు చేతులు మంటలుగా తిమ్మిర్లుగా ఉంటాయి.
ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి త్వరగా అంగస్తంభన జరగడం, మెడ మీద, చేతుల కింద ఎక్కువ నలుపుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జననాంగాల వద్ద దురద ఇన్ఫెక్షన్లు, నోరు తడి ఆరిపోవడం, ఉన్నఫలంగా బరువు తగ్గడం, పొరపాటున ఏదైనా గాయం తగిలితే ఆ గాయం ఎన్ని రోజులకు నయం కాకపోతే తప్పనిసరిగా డయాబెటిస్ బారిన పడ్డారని అవగాహనకు రావాలి.
ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే తప్పనిసరిగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.ఇక ఈ పరీక్షలలో మీకు డయాబెటిస్ అని కనుక తేలితే సరైన మందులతో పాటు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.