
కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కాలెయ ఆరోగ్యం దెబ్బతింటే మన శరీరం అందుకు సంబంధించిన ఎన్నో లక్షణాలను చూపిస్తుంది. అంటువ్యాధులు, వంశపారంపర్య వ్యాధులు, ఊబకాయం, ఆల్కహాల్ వాడకం వల్ల ఎన్నో రకాల కాలేయ వ్యాధులు వస్తాయి. ఫ్యూచర్ లో ఈ కాలేయ వ్యాధి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే ఈ సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ముప్పు తప్పుతుంది.
కాలేయం దెబ్బతినడానికి, కాలెయ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలు కాలేయ వ్యాధి సిరోసిస్ కు కారణమవుతుంది. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే కాలేయ వ్యాధి, కాలేయ నష్టం, కాలేయ క్యాన్సర్ కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సుమారు 10 మంది అమెరికన్లలో ఒకరికి ఈ వ్యాధి ఉందట. యుఎస్ లో సుమారు 5.5 మిలియన్ల మంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లేదా సిరోసిస్ తో బాధపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
పెద్దల వయసు వారిలో సుమారు 20% నుంచి 30% మందికి కాలేయంలో అదనపు కొవ్వు ఉందని అంచనా. ఇలాంటి పరిస్థితిని నాన్-ఆల్కహాల్-రికెట్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అయితే కాలెయ వ్యాధులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
కాలేయ వ్యాధి ఇతర లక్షణాలు..
పొత్తికడుపు నొప్పి.. ముఖ్యంగా కుడి వైపు
మూత్రం లేదా మలం రంగులో మార్పులు
అలసట
వాంతులు
చేతులు లేదా కాళ్ళ వాపు