భోజనం చేసిన తర్వాత సోంపు తింటే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Aug 25, 2024, 1:43 PM IST

సోంపు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని తింటే బరువు తగ్గడమే కాకుండా.. మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే సోంపు మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత తింటే ఏమౌతుందో తెలుసా? 
 



సోంపు ఒకటి లేదా రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిని క్యాటరింగ్ లో ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. మీకు తెలిసే ఉంటుంది మనం ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ లో తిన్న తర్వాత ఖచ్చితంగా సోంపును మనముందుంచుతారు. నిజానికి భోజనం తర్వాత సోంపును తినడం వల్ల ఫుడ్ సులువుగా జీర్ణమవుతుంది. అలాగే మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అసలు భోజనం చేసిన తర్వాత సోంపును తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఎన్నో ఏండ్ల నుంచి సోంపును తిన్నది బాగా అరగడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. తిన్న తర్వాత సోంపును తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది.

Latest Videos

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: సోంపులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మీరు ఉదయం సోంపును నీటిలో మరిగించి తాగొచ్చు. ఇది పోషక శోషణను పెంచుతుంది. కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.

గుండెకు మేలు చేస్తుంది: సోంపులో  పొటాషియం, ఫైబర్ తో పాటుగా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సోంపులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: సోంపు పోషకాలకు గొప్ప వనరు. దీనిలో విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సోంపును పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 

పీరియడ్స్ లో మేలు చేస్తుంది: పీరియడ్స్ కు సంబంధించిన నొప్పి, ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సోంపు బాగా ఉపయోగపడుతుంది. సోంపు టీ లేదా వాటర్ ను తాగడం వల్ల కడుపు తిమ్మిరి, వెన్నునొప్పి, పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

click me!