మనం తినే ప్రతికూరలో కరివేపాకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ కరివేపాకు వంటకు మంచి సువాసను అందించడమే కాకుండా.. ఫుడ్ ను టేస్టీగా కూడా ఉంచుతుంది. ఇంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా మంచి మేలుచేస్తుంది.
కరివేపాకు ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వంటల్లో కాకుండా.. మీరు వీటిని పచ్చిగా కూడా తినొచ్చు. ఇలా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ మీరు ఉదయం పరగడుపున 5 కరివేపాకు రెబ్బలను తింటే మీకు ఎన్నో వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఈ ఆకులను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కరివేపాకు పోషకాలు: కరివేపాకులో రకరకాల విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, పొటాషియం , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
బరువు నియంత్రణ: ప్రతిరోజూ ఉదయం పరిగడుపున 5 కరివేపాకు రెబ్బలను తిన్నట్టైతే మీ బరువు ఈజీగా అదుపులో ఉంటుంది. కరివేపాకు రెబ్బలను తినడం వల్ల మీకు త్వరగా ఆకలిగా అనిపించదు. అలాగే మీరు అతిగా తినకుండా ఉంటారు. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
మెరుగైన జీర్ణక్రియ: జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజూ పచ్చి కరివేపాకు రెబ్బలను తిన్నా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే కడుపునకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఆరోగ్యకరమైన చర్మం: కరివేపాకును పచ్చిగా తినడం వల్ల మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. కరివేపాకును పచ్చిగా తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: మీరు రోజూ ఉదయాన్నే 5 కరివేపాకు రెబ్బలను తినడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది: రోజూ పరిగడుపున 5 కరివేపాకు రెబ్బలను తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీనిలో ఉండే గుణాలు జుట్టును మూలం నుంచి బలోపేతం చేయడానికి బాగా సహాయపడతాయి.
మలబద్ధకం ఉపశమనం: కరివేపాకును పచ్చిగా నమిలి తినడం వల్ల మీరు తిన్న ఆహారం చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది.