Lemon Magic drink: నిమ్మకాయ నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసుకొని తాగి చూడండి, ఇదొక మ్యాజిక్ డ్రింక్

Published : Aug 12, 2025, 02:10 PM IST
Lemon Drink

సారాంశం

భారీ భోజనాలు చేశాక పొట్ట అసౌకర్యంగా ఉంటుంది. నిద్రపోవాలన్నా, కూర్చోవాలన్నా ఏదో తెలియని ఇబ్బంది. అలాంటప్పుడు నల్ల మిరియాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగితే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. 

వారాంతాల్లో భారీ భోజనాలు తినే వారి సంఖ్య ఎక్కువే. అలాగే ఇంట్లో వేడుకల్లో విందులు, వినోదాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో భారీ భోజనాలు తింటారు. కొంతమంది భారీ భోజనాలు తిన్నాక అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అలాగే క్యాలరీల సంఖ్య కూడా అధికంగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే భారీ భోజనాలు తిన్న తర్వాత గ్లాసుడు నిమ్మరసంలో, చిటికెడు మిరియాల పొడి వేసుకొని తాగేయండి. మీరు తిన్న ఆహారంలోని కొవ్వు శరీరానికి పట్టదు. పైగా జీర్ణ అసౌకర్యం కూడా ఉండదు.

నిమ్మకాయ నీటిలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పానీయం చిటికెడు నల్ల మిరియాలు వానికి జోడిస్తే చాలు... మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. నల్ల మిరియాలలో పైపేరిన్ ఉంటుంది. ఇది శరీరంలోని పుస్తకాలను శోషించుకునేలా చేస్తుంది. నిమ్మకాయ నీటి నుండి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లను ఇది శరీరం గ్రహించుకునేలా చేస్తుంది. కాబట్టి మంచి రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

జీర్ణ క్రియకు సహాయం

నల్ల మిరియాల పొడిలో జీర్ణ ఎంజైమ్‌లు ప్రేరేపించే శక్తి ఉంటుంది. ఇది పేగులు ఆరోగ్యాన్ని, పోషకాల విచ్ఛిన్నాన్ని మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ నీటిలో ఎప్పుడైతే పెప్పర్ కలుస్తుందో... ఇది విషాన్ని బయటకు పంపడంలో కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జీవక్రియకు కూడా మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రారంభించడానికి కూడా ఇది ఉత్తమ పానీయంగానే చెప్పుకోవాలి.

బరువు తగ్గించడానికి కూడా నల్ల మిరియాలలో ఉండే పైపరైన్ ఉపయోగపడుతుంది. ఇది కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది క్యాలరీలు తక్కువగా ఉండే నిమ్మకాయ నీటితో కలిసినప్పుడు అది విషయాన్ని తొలగించే అమృతంలా మారుతుంది. అలాగే బరువును పెరగకుండా అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చిరుతిళ్లు తినాలన్న కోరికలను కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి కోసం

శరీరంలో ఇన్ఫ్లమేషన్ వల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. నిమ్మకాయ, నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ తో నిండి ఉంటుంది. కాబట్టి శరీరంలోని ఫ్రీ రాడికల్‌తో పోరాడడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మిరియాల పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా. ఎక్కువ నిమ్మకాయలోని విటమిన్ సితో దీన్ని కలిపి తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఈ డ్రింకు అద్భుతంగా పనిచేస్తుంది.

ప్రతిరోజు ఉదయం నిమ్మకాయ నీటిలో పెప్పర్ పొడిని వేసి తాగేందుకు ప్రయత్నించండి. ఇది అద్భుతమైన మార్నింగ్ డ్రింక్ అని చెప్పుకోవాలి. ఆ రోజంతా కూడా మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటారు. జంక్ ఫుడ్ తినాలన్న కోరిక పుట్టదు. పైగా బరువు కూడా పెరగకుండా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం రోజు ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగేందుకు ప్రయత్నించండి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
డైప‌ర్ వాడితే పిల్ల‌ల కిడ్నీలు దెబ్బ‌తింటాయా.? ఇందులో నిజ‌మెంత‌..