ఈ పానీయాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి..

Published : Mar 11, 2023, 04:36 PM IST
ఈ పానీయాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి..

సారాంశం

అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే గుండెపోటు నుంచి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. ఛాతిలో నొప్పి, ముక్కు నుంచి రక్తంకారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది హై బీపీ లక్షణాలు.

ఈ బిజీ లైఫ్  వల్ల యువత కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఈ సైలెంట్ కిల్లర్ గుండెపోటు, స్ట్రోక్ , ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటివి రక్తపోటును పెంచుతాయి. ఈ అధిక రక్తపోటును సకాలంలో గుర్తించపోయినా.. చికిత్స తీసుకోకపోయినా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఛాతీ నొప్పి, తలనొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చూపు మసకబారడం వంటివి హై బీపీ సాధారణ లక్షణాలు.

రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో మార్పులు చాలా అవసరం. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పును ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ పేషెంట్లు రోజుకు రోజుకు ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉప్పును తీసుకోవాలి. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ప్రాసెస్ చేసిన మాంసం, మటన్, గొడ్డు మాంసం వంటి ఎర్ర మాంసాలు, నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తపోటునే కాదు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎలాంటి పానీయాలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అవొకాడో జ్యూస్

అవొకాడో జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవోకాడోల్లో పొటాషియం, ఫోలేట్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి అవొకాడో జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం మంచిది.

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ జ్యూస్ హై బీపీ పేషెంట్లకు ఎంతో మంచిది. బీట్ రూట్ లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు.

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్లు పొటాషియం ఎక్కువగా ఉండే కూరగాయ. క్యారెట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!