
కొంతమంది చిన్న పనికి కూడా బాగా అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు కప్పు కాఫీ లేదా టీని తాగుతుంటారు. నిజానికి ఈ టీ, కాఫీలు అప్పటిమందమే మీకు ఎనర్జీనిస్తాయి. ఈ తర్వాత మీ అలసటను మరింత పెంచుతాయి. అందులోనూ ఎండాకాలంలో పదేపదే కెఫిన్ ను తీసుకుంటే కడుపు ఉబ్బరం లేదా నిర్జలీకరణం సమస్యలు వస్తాయి. మిమ్మల్ని మీరు శక్తివంతంగా, రీఫ్రెష్ గా ఉంచుకోవడానికి కొన్ని పానీయాలు బాగా సహాయపడతాయి. వీటిని సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలతో సులువుగా తయారుచేయొచ్చు. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా కూడా ఉంచుతాయి. అవేంటంటే..
అవోకాడో, స్ట్రాబెర్రీ స్మూతీ
అవొకాడోలో విటమిన్ ఇ, పొటాషియం, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ మీ ఆకలిని నియంత్రించడానికి సహాయడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులను నియంత్రించడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అవొకాడోలో విటమిన్ ఇ, పొటాషియం, ఐరన్ లు కూడా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ మీ ఆకలిని కూడా నియంత్రిస్తుంది.
స్ట్రాబెర్రీల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్ గుండె జబ్బులను నియంత్రించడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం లు ఉంటాయి. జామ్ లు, జెల్లీలు, కేకులు, పుడ్డింగ్ లలో ఉపయోగించే ఈ పండులో 91 శాతం నీరు ఉంటుంది.
దీనికి కావాల్సిన పదార్థాలు : సగం తరిగిన అవొకాడో, 150 గ్రాముల స్ట్రాబెర్రీలు, హాఫ్ బౌల్ పెరుగు, 200 మి.లీ పాలు, టీస్పూన్ నిమ్మరసం, తేనె రుచికి తగినంత
దీన్ని ఎలా తయారుచేయాలంటే: అవొకాడో ముక్కలను మిక్సీలో వేసి గ్రైడ్ చేయండి. అందులోనే స్ట్రాబెర్రీలు, పాలను పోసి గ్రైండ్ చేయండి. ఈ స్మూతికి రుచికి తగినంత నిమ్మరసం కలపండి.
వాటర్ మెలన్, చియా విత్తనాలు
విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండే పుచ్చకాయ మండే వేడిలో శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రోజంగా శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ రసంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే చియా విత్తనాలను జోడించడం వల్ల వీటిలో పోషక విలువలు బాగా పెరుగుతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చియా విత్తనాలను తినడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు. స్థూలకాయులు వీటిని ఎక్కువగా తింటుంటారు.
కావాల్సిన పదార్థాలు: ఒక గిన్నె తరిగిన పుచ్చకాయ ముక్కలు, నల్ల ఉప్పు ఒక చిటికెడు, నిమ్మరసం ఒక టీస్పూన్, పుదీనా ఆకులు మూడు నుంచి నాలుగు, చియా విత్తనాలు ఒక టీస్పూన్
తయారుచేసే పద్దతి: ముందుగా చియా విత్తనాలను రాత్రంతా నానబెట్టండి. ముందుగా పుచ్చకాయ ముక్కలను బ్లెండ్ చేయండి. ఆ తర్వాత తయారు చేసిన జ్యూస్ లో చియా విత్తనాలను వేయండి. దీని టేస్ట్ ను పెంచడానికి దీనిలో నిమ్మరసం వేసి చిటికెడు బ్లాక్ సాల్ట్ ను కలపండి. కావాలనుకుంటే పుదీనా ఆకులతో దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. ఇది మీకు రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది.
దానిమ్మ, పైనాపిల్ జ్యూస్
చిన్న ధాన్యాలతో నిండిన రసం శరీరంలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ లోపాన్ని తీరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్ శరీరంలో రక్త లోపాన్ని పోగొడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పైనాపిల్ శరీరంలోని జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి కి పుష్కలంగా ఉండే ఈ పండ్లు శరీరంలో జింక్, భాస్వరం లోపాన్ని పోగొడుతాయి. నిజానికి ఉదయాన్నే ఎనర్జీ చాలా అవసరం. దానిమ్మ రసాన్ని బ్రేక్ ఫాస్ట్ తర్వాత, భోజనానికి ముందు దీన్ని తాగితే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
దీనికి కావాల్సిన పదర్థాలు : ఒక గిన్నె దానిమ్మ గింజలు, తరిగిన ఒక గిన్నె పైనాపిల్, నిమ్మరసం, నల్ల ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే పద్దతి: దీన్ని తయారు చేయడానికి దానిమ్మ గింజలను మిక్సీ పట్టండి. తర్వాత దీన్ని వడకట్టి దీన్ని విత్తనాలను వేరుచేయండి. ఇప్పుడు దానిమ్మ రసంలో పైనాపిల్ ముక్కలను వేసి బ్లెండ్ చేయండి. ఈ జ్యూస్ లో బ్లాక్ సాల్ట్, నిమ్మరసం కలపండి.