పొరపాటున కూడా వీటిని పరిగడుపున తినకండి.. తిన్నారో మీ పని అంతే..!

Published : Mar 11, 2023, 03:18 PM IST
 పొరపాటున కూడా వీటిని పరిగడుపున తినకండి.. తిన్నారో మీ పని అంతే..!

సారాంశం

ఆరోగ్యకరమైన ఆహారాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్నింటిని మాత్రం పరిగడుపున అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే గ్యాస్ట్రిక్ నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పరిగడుపున ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కీరదోసకాయలు: కీరదోసకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కానీ వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే అపానవాయువు, కడుపు నొప్పి వస్తుంది.

సిట్రస్ పండ్లు:  సిట్రస్ పండ్లలో విటమిన్ సి తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ ద్రాక్షపండ్లు, నారింజ వంటి సిట్రస్ పండ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగుంటాయి. వీటిని పరిగడుపున తింటే అన్నవాహిక సమస్యలు వస్తాయి. 

అరటిపండ్లు: అరటి పండ్లను తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. కానీ అరటి పండ్లను పరిగడుపున తినకూడదు. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ పండును పరిగడుపున తింటే శరీరంలో మెగ్నీషియం, పొటాషియం అసమతుల్యత ఏర్పడుతుంది. 

యాపిల్స్:  రోజుకో యాపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెప్తారు. అయితే ఆయుర్వేదం ప్రకారం.. యాపిల్స్‌ను ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకూడదు. ఇలా తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. 

టీ, కాఫీ: పరిగడుపున టీ, కాఫీలను అసలే తాగకూడదు. వీటిని తాగితే కడుపులో ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. పరిగడుపున కాఫీని తాగితే పొట్టలో ఆమ్లత మరింత పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. 

టొమాటో:  టొమాటోలో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ టమాటాలను పరిగడుపున తినకూడూదు. ఎందుకంటే టొమాటోల్లో టానిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఆమ్లతను పెంచుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను ఇది మరింత పెంచుతుంది. 

బంగాళాదుంప చిప్స్: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సోడియం తక్కువగా ఉండే ఆహారానే తినాలి. అయితే బంగాళాదుంప చిప్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును పెంచుతుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. అందుకే వీటిని పరిగడుపున తినకండి.

కారంగా ఉండే అల్పాహారం: ఖాళీ కడుపుతో మిరపకాయలు, మసాలా దినుసులు తీసుకోవడం వల్ల కడుపులో చికాకు కలుగుతుంది. తిమ్మిరి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. వేడి స్వభావం కారణంగా ఇవి అజీర్ణానికి కారణమవుతాయి.

కార్బోనేటేడ్ పానీయాలు: కార్భోనేటెడ్ పానీయాలను కూడా పరిగడుపున తాగకూడదు. ఎందుకంటే ఇవి శ్వాసకోశ మార్గాలను దెబ్బతీస్తాయి. కడుపునకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఇది భోజనం నెమ్మదిగా జీర్ణం కావడానికి, మలబద్ధకానికి దారి తీస్తుంది.

ముడి కూరగాయలు: ముడి కూరగాయల్లో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిగడుపున తీసుకుంటే కడుపు భారాన్ని పెంచుతుంది. ఖాళీ కడుపుతో వీటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. 

స్వీట్లు:  చక్కెరను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ప్యాంక్రియాస్‌పై విపరీతమైన భారం పడుతుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది. 

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!