డిప్రెషన్ లో ఉన్నారా? బయటపడాలంటే ఇలా చేయండి..

Published : Mar 24, 2023, 04:29 PM IST
 డిప్రెషన్ లో ఉన్నారా? బయటపడాలంటే ఇలా చేయండి..

సారాంశం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన  ఆహారాన్ని తినడం, కంటి నిండా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మంచి జీవన శైలి అలవాట్లు మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేస్తాయి. 

డిప్రెషన్ అనేది మానసిక అనారోగ్య సమస్య. దీనివల్ల ఎప్పుడూ నిరాశ, బాధ, విచారం, ఒంటరితనం వంటి సమస్యలు రావడమే కాదు ఎలాంటి విషయాలపై కూడా ఆసక్తి ఉండదు. ఈ డిప్రెషన్ ఒక మనిషిని సులువుగా చంపగలదు. ఈ డిప్రెషన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ రుగ్మత. ఇవి రోజువారీ జీవితం, పని, సంబంధాలు, మొత్తం ఆరోగ్య శ్రేయస్సును బాగా ప్రభావితం చేస్తుంది.

జన్యుశాస్త్రం, పర్యావరణ కారకాలు, జీవితంలో జరిగిన సంఘటనలు వంటి వివిధ కారణాల వల్ల డిప్రెషన్ కు లోనవుతారు. చికిత్స, మందులతో డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. అయినప్పటికీ మన జీవినశైలిలో కొన్ని మార్పులు కూడా ఈ సమస్య నుంచి మనల్ని పూర్తిగా బయటపడేస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రమం తప్పకుండా వ్యాయామం 

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎన్నో శారీరక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం ఫిట్ గా ఉంటుంది. అంతేకాదు మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామం నిరాశ లక్షణాలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తే డిప్రెషన్ తో పాటుగా ఒత్తిడి స్థాయిలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

ఆరోగ్యకరమైన ఆహారం

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలను ఈ ఫుడ్ అందిస్తుంది.

తగినంత నిద్ర 

శారీరక, మానసిక, మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకు తగినంత నిద్ర చాలా అవసరం. కంటినిండా నిద్రలేకపోవడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. మానసిక సమస్యలు కూడా ఎక్కువవుతాయి. తగినంత నిద్రపోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. 

ఒత్తిడిని తగ్గించే పద్ధతులు

ధ్యానం, యోగా, లోతైన శ్వాస లేదా ఇతర కార్యకలాపాలు కూడా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

ఆరుబయట టైం స్పెండ్ చేయడం

ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా రోజులో కాస్త సమయాన్ని ఆరుబయట గడపండి. ప్రకృతి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే నిరాశ లక్షణాలను తగ్గిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు బయట సమయాన్ని గడపండి. 

ఇతరులతో కనెక్ట్ అవ్వండి

ఒంటరితనం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ఆలోచనలు మెదడును చుట్టుముడతాయి. ఒత్తిడి, డిప్రెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపండి. ఇది మీ మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఆల్కహాల్, మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించండి

మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల డిప్రెషన్ ప్రమాదం మరింత పెరుగుతుంది. అందుకే మద్యం,మాదకద్రవ్యాల వాడకాన్ని పరిమితం చేయండి. లేదా ఈ అలవాట్లను పూర్తిగా వదులుకోండి. 

PREV
click me!

Recommended Stories

ఉదయమా లేదా రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!