పాలిచ్చే తల్లుల రొమ్ముల పరిమాణం పెద్దగా ఉంటుంది. అందుకే మునపటి బ్రాలను వేసుకోకూడదు. అలాగే మరీ బిగుతుగా ఉండే బ్రాలను వేసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తల్లి పాలిచ్చే సమయంలో బ్రా వేసుకోవాలా? వద్దా? అన్న అనుమానాలు చాలానే వస్తుంటాయి. తల్లిపాలపై బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. పాలిచ్చే తల్లుల వక్షోజాల పరిమాణం, ఆకృతి పెద్దగా ఉంటుంది. దీనివల్ల మీ పాత బ్రాలు మీకు సరిపోకపోవచ్చు. మీ బిడ్డకు పాలివ్వడానికి సహాయపడటానికి మీరు మరింత సౌకర్యవంతంగా ఉండే బ్రా లను మాత్రమే వేసుకోవాలి. అయితే పాలిచ్చే తల్లులు కొన్ని తప్పులను అసలే చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
తల్లి పాలిచ్చేటప్పుడు బ్రా ధరించాలా? వద్దా?
ప్రెగ్నెన్సీ, డెలివరీ వల్ల మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా రొమ్ముల పరిమాణం బాగా పెరుగుతుంది. దీంతో మీ రొమ్ములను కంఫర్ట్ గా ఉంచడానికి బ్రాలు సరిపోవు. అందుకే మారుతున్న రొమ్ము పరిమాణానికి సౌకర్యవంతంగా సరిపోయే నర్సింగ్ బ్రాను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బ్రా ను వేసుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా మహిళల ఇష్టమని నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లులు బ్రాను వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. కాకపోతే సౌకర్యవంతంగా ఉండే బ్రాలను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. బ్రా లను వేసుకోవాలనుకుంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
పాలిచ్చే సమయంలో వక్షోజాల పరిమాణం పెరిగి బరువుగా అనిపిస్తుంది. ప్రతిసారీ వక్షోజాల నుంచి పాలు కారుతుంటాయి. అందుకే మీ వక్షోజాలకు సపోర్ట్ చేసే బ్రా లను మాత్రమే వేసుకోవాలి.
కొన్ని బ్రాలు బరువైన వక్షోజాలకు మద్దతునిస్తాయి. వెన్నునొప్పిని నివారించడానికి కూడా సహాయపడుతాయి. అందుకే మీ పాత బ్రాను ఉపయోగించకుండా నర్సింగ్ బ్రాను వేసుకోండి.
బ్రా మరీ బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అసౌకర్యానికి దారితీస్తుంది. మద్దతు కోసం వెనుక పట్టీ వెడల్పుగా ఉండాలి. పట్టీల సర్దుబాటు కోసం హుక్ లు ఉండాలి.
ఫీడింగ్ బ్రాను మెత్తని పదార్థం లేదా కాటన్ తో తయారు చేస్తారు. ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. బ్రాకు ఒక క్లాప్ కూడా ఉంటుంది. ఇది శిశువుకు రొమ్మును అందుబాటులో ఉంచడాన్ని సులువు చేస్తుంది. రొమ్ముకు మద్దతును ఉంచితేనే ఇది జరుగుతుంది. ఫీడింగ్ బ్రా పొరలు కూడా లీకేజీని ఆపుతాయి.
చాలా మంది రాత్రిపూట కూడా బ్రాలను వేసుకుంటారు. ఇది రొమ్ములకు మంచి మద్దతునిస్తుంది. లీకైన పాలను గ్రహించడానికి సహాయపడుతుంది. తల్లి సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.
అండర్ వైర్డ్ బ్రాను ధరించడం వల్ల పాల ఉత్పత్తి తగ్గదు. కానీ పాల నాళాలను నిరోధిస్తుంది. దీంతో పాల ప్రవాహం తగ్గుతుంది.
అయితే బ్రా పచ్చిగా అయితే వీటిని తరచుగా మార్చుతూ ఉండాలి.
పాలిచ్చేటప్పుడు బ్రా ధరించడం వల్ల సమస్యలు వస్తే వీటిని ధరించకపోవడమే మంచిది.