పుదీనా నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా?

Published : Mar 12, 2023, 02:28 PM IST
 పుదీనా నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా?

సారాంశం

పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  అంతేకాదు జీర్ణ సమస్యలను పోగొట్టడానికి కూడా పుదీనా ఆకులు మేలు చేస్తాయి.   

పుదీనా ఆకుల్లో ఔషదగుణాలుంటాయి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను వేగవంతం చేయడానికి సహాయపడతాయి.

వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శ్వాసకోశ ప్రక్రియలో మార్పులను నివారించడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న పుదీనాకు మొటిమలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పుదీనా నీరు మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని విషయపదార్థాలను బయటకు పంపుతుంది. రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. పుదీనా మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. రాత్రిపూట పుదీనా టీ లేదా పుదీనా నీటిని తాగితే వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఆలోచనలు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఐబీఎస్, మొటిమలు, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం సమస్యలతో బాధపడేవారికి పుదీనా వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ తగినంత పుదీనా నీటిని తాగండి. పుదీనా నీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆస్తమా రోగులకు పుదీనా ఆకులు మంచి మేలు చేస్తాయి. పుదీనా నీటిని తాగడం వల్ల ఆస్తమా రోగులకు ఉపశమనం లభిస్తుంది.

పుదీనా ఆకుల సారం దంతాల నుంచి రాతి ఫలకాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. టూత్ పేస్ట్, మౌత్ వాష్ లేదా చూయింగ్ గమ్స్ లో ఉండే పుదీనా నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నోటి పరిశుభ్రతను కాపాడుతుంది.

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!