రంజాన్ ఉపవాసం వల్ల యూరిక్ యాసిడ్ పెరగొచ్చు.. తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Mar 26, 2023, 11:10 AM IST
రంజాన్ ఉపవాసం వల్ల యూరిక్ యాసిడ్ పెరగొచ్చు.. తగ్గాలంటే ఇలా చేయండి..

సారాంశం

Ramadan 2023: రంజాన్ ఉపవాసం నెలరోజుల పాటు ఉంటారు. అయితే ఈ ఉపవాస సమయంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే పెరిగిన యూరిక్ యాసిడ్ ను తగ్గించుకోవచ్చు. 

Ramadan 2023: మూత్ర విసర్జనలో ఇబ్బంది, మంట, జ్వరం, మోకాళ్లు, పాదాల్లో నొప్పి, వాపు వంటివన్నీ పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణాలే. వీటిని బట్టే మీ శరీరంలో యూరిక్ ఆమ్లం పెరిగినట్టుగా తెలుసుకోవచ్చు. అయితే రోజువారీ దినచర్యలో సాధారణ మార్పులు, సరైన ఆహారపు అలవాట్లు మిమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటపడేయడానికి సహాయపడతాయి. సరళమైన ఆహారం ద్వారా పెరిగిన యూరిక్ ఆమ్లాన్ని తగ్గించొచ్చు. 

యూరిక్ ఆమ్లం అంటే ఏమిటి

యూరిక్ ఆమ్లం ఒక తెలుపు రంగు స్ఫటిక మూలకం. ఇది ప్రోటీన్ జీవక్రియలో భాగం. ఈ మూలకం రక్తం, మూత్రంలో కనిపిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల చిన్న చిన్న రాళ్ళు లేదా స్ఫటికాలు ఏర్పడుతాయి. ఇవి రక్తంలో కనిపించే టాక్సిన్స్. ఇవి రాళ్ళుగా మారుతాయి.

పెరిగిన యూరిక్ ఆమ్లం లక్షణాలు

  • కీళ్లలో నొప్పి 
  • మూత్ర విసర్జనలో సమస్య, మంట 
  • అలసట, ఒళ్లు నొప్పులు 
  • జలుబు కారణంగా జ్వరం 

యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది?

  • మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఉంటే..
  • అధిక బరువు లేదా ఊబకాయం
  • ఎక్కువ సేపు ఏమీ తినకపోవడం
  • డయాబెటిస్ రోగులకు 


ఉపవాస సమయంలో యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తినండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, క్వినోవాను తినాలి. యూరిక్ ఆమ్లం పెరిగినప్పుడు ఎక్కువ ప్యూరిన్లను నివారించొచ్చు. ఇది ముఖ్యంగా ఎర్ర మాంసం, అవయవ మాంసం, సీఫుడ్ లో ఉంటుంది. ఇలాంటివారు ప్యూరిన్ ఎక్కువుగా ఉండే ఆహారాన్ని జీర్ణించుకోలేరు. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు, ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తినడం మానుకోవాలి. యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

విటమిన్ సి 

యాం టీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విటమిన్ సి మీ రక్తంలో యూరిక్ ఆమ్లాన్ని కరిగించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంత ఎక్కువ తింటే మీరు ఈ  సమస్య నుంచి అంత తొందరగా బయటపడతారు. 19 ఏళ్లు పైబడిన వారికి రోజుకు 75 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం.

హెర్బల్ టీ 

హెర్బల్ టీని రోజూ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గడమే కాదు శరీరం నిర్విషీకరణ చేయబడుతుంది కూడా. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం చాలా తగ్గుతుంది. హెర్బల్ టీని రోజుకు రెండు మూడు సార్లు తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

పండ్లు

ఈ సమస్యను ఎదుర్కోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ ను తప్పకుండా తినాలి. దీని కోసం మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆపిల్, అరటిపండ్లు, నారింజ, పచ్చి కొబ్బరిని తినాలి. 

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల రక్తంలో పీహెచ్ స్థాయి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి పనిచేస్తాయి. రోజుకు ఒకసారి రెండు టీస్పూన్లు తాగాలి. డయాబెటిస్ పేషెంట్లకు యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. 

 పుష్కలంగా ద్రవాలు తాగాలి

యూరిక్ ఆమ్లాన్ని నియంత్రించడానికి పుష్కలంగా నీటిని తాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, డిటాక్స్ పానీయాలతో సహా ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. శీతల పానీయాలు, షుగర్ కంటెంట్ డ్రింక్స్ ను అసలే తాగకూడదు. ఎందుకంటే ఈ డ్రింక్స్ యూరిక్ యాసిడ్ సమస్య ప్రమాదాన్ని పెంచుతాయి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రం వస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Kallu: తాటి క‌ల్లు, ఈత క‌ల్లుకు తేడా ఏంటి.? రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది.?
అల్లాన్ని రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుంది?