ఫుట్ బాల్ నుంచి బ్యాట్మింటన్ వరకు.. ఈ గేమ్స్ ఆడితే ఎంత తొందరగా బరువు తగ్గుతారో..!

Published : Mar 26, 2023, 10:25 AM IST
ఫుట్ బాల్ నుంచి బ్యాట్మింటన్ వరకు.. ఈ గేమ్స్ ఆడితే ఎంత తొందరగా బరువు తగ్గుతారో..!

సారాంశం

బరువు తగ్గేందుకు రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. రన్నింగ్ కు వెళ్లాలి. కానీ రోజూ వీటిని చేయాలంటే విసుగొస్తుంది. మీకు తెలుసా మీకు ఇష్టమైన  ఆటలతో కూడా సులువుగా బరువు తగ్గొచ్చు.   

అదనపు బరువు తగ్గించుకోవాలంటే జిమ్ముల్లో చెమటలు చిందించాల్సిందే. నిజానికి వర్కౌట్స్ తో శరీరం ఫిట్ గా మారడమే కాదు.. కేలరీలు కూడా కరుగుతాయి. కానీ రోజూ అవే వర్కౌట్స్ చేయాలంటే విసుగొస్తుంటుంది. ఇలాంటి వారు కొన్ని గేమ్స్ ఆడినా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. 

బరువు తగ్గడానికి క్రీడలు

చాలా మంది వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే రోజూ అవే చేయాలంటే విసుగు చెందుతారు. దీనివల్లే గుర్తొచ్చిప్పుడు జిమ్ములకు వెళుతుంటారు. ఇలాంటివారు కొన్ని ఆటలు ఆడి కూడా సులువుగా బరువు తగ్గొచ్చు. అవును ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా అదనపు కేలరీలను కూడా కరిగిస్తాయి. ఇంతకీ అవేంటంటే.. 

బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్ ను చిన్నతనంలో ఎక్కువగా ఆడుతుంటారు. నిజానికి కేలరీలను తగ్గించడానికి ఈ క్రీడ చాలా మంచి వ్యాయామం. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు ముందుకు, వెనుకకు కదులుతారు. అలాగే పరుగెత్తుతారు. దూకుతారు. వంగుతూ ఉంటారు. కూర్చుంటారు. ఈ ఆట వల్ల మీ శరీరం మొత్తం కదులుతుంది. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే బరువు తగ్గడాన్ని పెంచుతుంది. అందుకే బరువు తగ్గడానికి ఈ ఆటను ఆడండి. ఈ ఆటను ఎక్కువగా ఆడితే కేలరీలను ఎక్కువ బర్న్ చేస్తారు. 

స్విమ్మింగ్

బరువు తగ్గడానికి, కేలరీలను బర్న్ చేయడానికి స్విమ్మింగ్ ఉత్తమ క్రీడలలో ఒకటని నిపుణులు అంటున్నారు. స్విమ్మింగ్ పూల్ శరీర కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి  సహాయపడుతుంది. మీరు నీటిలో ఉన్నందుకు వ్యాయామం చేసేటప్పుడిలా మీకు వెచ్చగా అనిపించదు. జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ లో ఒక అధ్యయనం ప్రకారం.. 45 నిమిషాలు, వారానికి మూడుసార్లు ఈత కొట్టడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. శరీర కూర్పు కూడా మెరుగుపడుతుంది. ఇది మీ మొత్తం శరీరాన్ని టోనింగ్ చేయడానికి సహాయపడుతుంది. 

సైక్లింగ్

బరువు తగ్గడానికి సైక్లింగ్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇదొక గొప్ప అవుట్ డోర్ క్రీడ. ఇది పనిని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. సైక్లింగ్ అనేది రన్నింగ్ కంటే ఒక రకమైన సున్నితమైన కార్డియో యాక్టివిటీ. దీనిని వీలైనంత ఎక్కువసేపు చేయొచ్చు. దీన్ని మీరెంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. సైక్లింగ్ బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు, బలం పెరిగేందుకు, శరీర టోనింగ్ తో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సైక్లింగ్ గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.

ఫుట్ బాల్

ఫుట్ బాల్ ఆట వల్ల మీరు ఎక్కువ సేపు ఉరుకుతారు. ఇది మీ దిగువ శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మీ కాళ్ళను టోన్ చేస్తుంది. అలాగే కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆట జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఏ భంగిమలోనైనా ఆడటం, కాలుతో బంతిని తన్నడం శారీరక శ్రమను, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది. 

బాక్సింగ్

దిశా పటానీ, కియారా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి బాలీవుడ్ నటీమణులు బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. బాక్సింగ్ ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది. బాక్సింగ్ ప్రతి గంటకు 800 కేలరీలను బర్న్ చేయగలదు. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని నిరంతరం కదిలిస్తుంది. ఇది బరువు తగ్గడానికి అద్భుతమైనది క్రీడ. అంతేకాదు ఇది మీ కండరాల బలాన్ని కూడా పెంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. 

PREV
click me!

Recommended Stories

Health Tips: ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిపుణుల మాట ఇదే!
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్