ఉల్లిపాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందా?

By Mahesh RajamoniFirst Published Mar 26, 2023, 7:15 AM IST
Highlights

ఉల్లిపాయ వినియోగానికి, కొలెస్ట్రాల్ మధ్య సంబంధం ఉందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాగా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. 
 

ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఉల్లిపాయ చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ వినియోగానికి, కొలెస్ట్రాల్ మధ్య సంబంధంపై వివిధ అధ్యయనాలు జరిగాయి. కాగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోకపోతే గుండె జబ్బుులతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. 

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే ధమనులు ఇరుగ్గా మారుతాయి. దీంతో ధమనుల నుంచి రక్తం, ఆక్సిజన్ లు స్వేచ్ఛగా ప్రవహించలేవు. దీనివల్ల మన శరీరంలోని భాగాలతో పాటుగా గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చెడు కొలెస్ట్రాల్ ధమనులను పూర్తిగా అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు నియంత్రణలో ఉంటాయి. 

రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ ఫంక్షన్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువ ఉల్లిపాయలు తినే వారిలో ఎక్కువ మొత్తంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గినట్టు కనుగొన్నారు. 

ఉల్లిపాయలు మొత్తం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. మీ రోజు వారి ఆహారంలో ఉల్లిపాయలను చేర్చడం వల్ల జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను నివారిస్తాయి. ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాటి తాపజనక లక్షణాలు అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డకట్టకుండా రక్షించడానికి సహాయపడతాయి.

ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాల వాపును నివారించడానికి, రక్తంలో ప్లేట్లెట్స్ కలవకుండా నిరోధించడానికి, నైట్రిక్ ఆక్సైడ్ ను పెంచడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రభావాలన్నీ రక్త ప్రవాహాన్ని పెంచడానికి, ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

click me!