పేరెంట్స్ బీ అలర్ట్... పిల్లల్లో స్కార్టెట్ జ్వరాలు.. దీని లక్షణాలేంటి..?

By Ramya SridharFirst Published Mar 2, 2024, 1:00 PM IST
Highlights

 20 పిల్లలు జ్వరంతో ఆస్పత్రిలో చేరితో 12 నుంచి 15 మందిలో ఈ జ్వరం లక్షణాలే కనిపిస్తున్నాయట.  ఈ వ్యాధి కొత్తదేమీ కాదు. గతంలోనూ ఉంది. కానీ.. ఈ సారి మాత్రం  పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


పిల్లలు తరచూ జబ్బునపడుతూ ఉంటారు. ఇది చాలా కామన్. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం  లాంటివి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే.. చాలా మంది పిల్లలకు ఫీవర్ వచ్చిందంటే.. అది తగ్గిపోతుందిలే అని పట్టించుకోరు. వరసగా మూడు నాలుగు రోజులైనా తగ్గకపోతే అప్పుడు వైరల్ ఫీవర్ అని  అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇప్పుడు మరో కొత్త రకం ఫీవర్లు రావడం మొదలయ్యాయి. అదే స్కార్లెట్ ఫీవర్స్.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చాలా మంది పిల్లలు ఈ స్కార్లెట్ ఫీవర్స్ బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. 20 పిల్లలు జ్వరంతో ఆస్పత్రిలో చేరితో 12 నుంచి 15 మందిలో ఈ జ్వరం లక్షణాలే కనిపిస్తున్నాయట.  ఈ వ్యాధి కొత్తదేమీ కాదు. గతంలోనూ ఉంది. కానీ.. ఈ సారి మాత్రం  పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించాలి. లేదంటే.. పరిస్థితి విషమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ  స్కార్లెట్ ఫీవర్  స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు.. ఆ తుంపర్లు మరొకరిపై పడితే.. వారికి కూడా ఈ బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువగా ఉంది.  అందుకే.. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయంటే,..

1.102 డిగ్రీలతో కూడిన జ్వరం..
2.అకస్మాత్తుగా గొంతు నొప్పి

3.తలనొప్పి, వికారం, వాంతులు
4.కడుపులో నొప్పి

5శరీరంపై దద్దుర్లు
6.నాలుక స్టాబెర్రీ రంగులోకి మారుతుంది
7.గంతు, నాలుకపై తెల్లని పూత

8.ట్రాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దవి కనిపిస్తాయి.

 

ఈ లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే పిల్లలను వెంటనే వైద్యల వద్దకు తీసుకువెళ్లి.. తగిన చికిత్స అందించాలి.

click me!