భారత్‌లో తొలి హెచ్‌పీవీ వ్యాక్సిన్ .. 4 రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ , రూ.400 లోపే అందుబాటులోకి

By Siva Kodati  |  First Published Jan 24, 2024, 7:53 PM IST

గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలోని మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ క్యాన్సర్ గర్భాశయంలో సంభవిస్తుంది. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడానికి భారతదేశం మొట్టమొదటిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. ‘‘ CERVAVAC ’’. రూ. 200 నుంచి రూ.400 ఖర్చులో లభిస్తుంది. 


గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలోని మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ క్యాన్సర్ గర్భాశయంలో సంభవిస్తుంది. Human Papillomavirus కారణంగా ఇది సోకుతుంది. అంతేకాదు.. పురుషాంగ క్యాన్సర్, ఆసన క్యాన్సర్, ఒరోఫారింజియల్ క్యాన్సర్‌తో సహా గర్భాశయ , ఇతర క్యాన్సర్‌లకు కారణమవుతుంది. ఒరోఫారింజియల్ క్యాన్సర్ అనేది గొంతు వెనుక భాగంలో వచ్చే క్యాన్సర్, దీనిని ఓరోఫారింక్స్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో .. అన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కేవలం ఒకే ఒక్క టీకాతో తగ్గించవచ్చు. 

చాలామందికి తెలియని వాస్తవం ఏమిటంటే.. గర్భాశయ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ టీకా 2016లో క్యాన్సర్ దినోత్సవం రోజున ప్రారంభించబడింది. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడానికి భారతదేశం మొట్టమొదటిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. ‘‘ CERVAVAC ’’. రూ. 200 నుంచి రూ.400 ఖర్చులో లభిస్తుంది. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఇది అందుబాటులో వుంటుంది. ఎస్ఐఐ అభివృద్ధి చేసిన ‘‘ CERVAVAC ’’కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్ ధర రూ. 2000 నుంచి రూ.4000 వరకు వుంటుంది. 

Latest Videos

undefined

HPV టీకా అంటే ఏమిటి :

హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ టీకాలు కొన్ని రకాల హ్యూమాన్ పాపిల్లోమా వైరస్‌ల సంక్రమణను నిరోధిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో వున్న హెచ్‌పీవీ టీకాలు రెండు, నాలుగు లేదా తొమ్మిది రకాల హెచ్‌పీవీల నుంచి రక్షిస్తాయి. అన్ని టీకాలు కనీసం 16 నుంచి 18 రకాల హెచ్‌పీవీల నుంచి రక్షణను అందిస్తాయి.

HPV టీకా 4 క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

హ్యూమాన్ పాపిల్లోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ మాత్రమే కాకుండా పురుషాంగ క్యాన్సర్, ఆసన క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ కూడా వస్తుందని నిపుణులైన వైద్యులు విశ్వసించారు. అలాంటి పరిస్ధితుల్లో మీరు ఈ ఒక్క టీకాను పొందినట్లయితే.. 4 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 

టీకా తీసుకున్నాక స్కాట్లాండ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు :

స్ట్రాత్‌క్లైడ్ , ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయాల సహకారంతో పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్ ప్రచురించిన ఓ అధ్యయనంలో గర్భాశయ క్యాన్సర్ అభివృద్దిని నిరోధించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. వాస్తవానికి 2008లో స్కాట్లాండ్‌లో 9 నుంచి 14 ఏళ్ల వయసు గల బాలికలకు ఈ టీకా వేశారు. ఇప్పుడు ఆమె వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వుంది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ తీసుకున్న అమ్మాయిలందరిలో ఒక్క కేసు కూడా కనిపించలేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇంత విస్తృతంగా పరిశోధనలు చేసి 100 శాతం సానుకూల ఫలితాలు రాబట్టిన తొలి నివేదిక ఇదే. 

స్క్రీనింగ్ ప్రాముఖ్యత :

ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతక క్యాన్సర్ నుంచి రక్షిస్తుందని, దీనికి తోడు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ కూడా అవసరమని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ టీకా క్యాన్సర్ అన్ని కేసులను నిరోధించకపోవచ్చునని, అందువల్ల రెగ్యులర్ చెకప్‌లను కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా భారతదేశంలో టీకా కార్యక్రమంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చాలని నిపుణులు కోరుతున్నారు. తద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను అరుదైన వ్యాధిగా మార్చవచ్చునని చెబుతున్నారు. 

click me!