కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని రోజూ తినండి

Published : Mar 12, 2023, 07:15 AM IST
 కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని రోజూ తినండి

సారాంశం

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే డాక్టర్ సలహా తీసుకునే పెయిన్ కిల్లర్లను వాడాలని నిపుణులు చెబుతున్నారు.   

మూత్రపిండాలు మన శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకుంటే శరీరంలో వ్యర్థాలు పెరిగిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాగా ప్రస్తుతం కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నో కారణాల వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కొన్నిసార్లు మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. 

మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం బాగా సహాయపడుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. అలాగే నీళ్లను పుష్కలంగా తాగాలి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు

పసుపులో దివ్య ఔషదగుణాలుంటాయి. పసుపునకు కర్కుమిన్ అనే రసాయనం రంగును ఇస్తుంది. ఇది అనేక వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు. మీ రోజు వారి ఆహారంలో పసుపును చేర్చితే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

అల్లం

అల్లం కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అల్లంలో  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్నీ మీ రోజు వారి ఆహారంలో చేర్చితే మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. 

వెల్లుల్లి

వెల్లుల్లి  మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు వెల్లుల్లిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. వెల్లుల్లి ఫుడ్ రుచిని కూడా పెంచుతుంది. మిమ్మల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఉల్లిపాయ

ఉల్లిపాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఉల్లిపాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. దీన్ని రోజూ తింటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

రెడ్ క్యాప్సికం

రెడ్ క్యాప్సికం లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!