
గజిబిజీ లైఫ్ స్టైల్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, నీళ్లు తక్కువగా తాగడం ఇతర కారణాల వల్ల చాలామంది కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయడం, వ్యర్థాలను తొలగించడం, ద్రవాలను బ్యాలెన్స్ చేయడం, బీపీని కంట్రోల్ చేయడం, హార్మోన్స్ ని రిలీజ్ చేయడం లాంటి ముఖ్యమైన పనులు చేస్తాయి.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని యోగాసనాలు కిడ్నీల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కిడ్నీలకు రక్త ప్రసరణను పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతర్గత అవయవాలను ఉత్తేజపరుస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా యోగా చేస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. డయాలసిస్ లాంటి చికిత్సలు అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆసనాలేంటో ఇక్కడ చూద్దాం.
1. భుజంగాసనం
భుజంగాసనాన్నికోబ్రా భంగిమా అని కూడా అంటారు. ఇది సూర్య నమస్కారంలో భాగం. ఈ ఆసనం శరీరంలో, ముఖ్యంగా కిడ్నీలకు రక్త ప్రసరణను పెంచుతుంది. పెల్విక్ ప్రాంతంలోని అవయవాలను ఉత్తేజపరుస్తుంది. ఈ ఆసనంలో చేతులపై బరువు వేసి శరీరం ముందు భాగాన్ని పైకి లేపి కొన్ని నిమిషాలపాటు ఉండాలి.
2. అర్ధ మత్స్యేంద్రాసనం
ఈ ఆసనం చేపలా ఉంటుంది. వెన్నెముకను సాగదీస్తుంది. పెల్విక్ ప్రాంతంపై ప్రభావం పడుతుంది. ఈ ఆసనం కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన జీర్ణక్రియ, మంచి నిద్రకు సహాయపడుతుంది.
3. పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనాసనం పొట్టలోని అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కిడ్నీల నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది. కిడ్నీలపై ఒత్తిడి పెరగడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది.
4. ధనురాసనం
ధనురాసనాన్ని విల్లు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేసేటప్పుడు శరీరం విల్లు ఆకారంలో వంగి ఉంటుంది. ఈ ఆసనం కిడ్నీలు, లివర్ ని బలపరుస్తుంది. కిడ్నీలకు రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
5. సేతుబంధాసనం
సేతుబంధాసనంలో వెన్నెముకను వంతెనలా పైకి లేపాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. వెన్నెముకను బలపరుస్తుంది. కిడ్నీలకు రక్త ప్రసరణను పెంచుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.