పనిలో పడి మధ్యాహ్నం తినకపోతే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Sep 30, 2024, 3:50 PM IST

పనిలో పడటం తప్పేం కాదు. కానీ పనే లోకంగా మారి.. తినకుండా ఉంటేనే మీకు లేనిపోని వ్యాధులు చుట్టుకుంటాయి. చాలా మంది మధ్యాహ్నం సమయంలో పనుల్లో పడి తినడం కూడా మర్చిపోతుంటారు. కానీ మధ్యాహ్నం తినకపోతే ఏమౌతుందో తెలుసా? 
 


ఆఫీసుల్లో పని ఎక్కువగా ఉండటం చాలా కామన్. అలాగని ఎప్పుడూ పనిమీదనే కూర్చోలేం కదా. కానీ కొంతమంది పని ఎక్కువగా ఉందని చెప్పి మధ్యాహ్నం తినకుండా అలాగే ఉంటారు. తినే  టైం ఆఫీస్ వర్క్ ను కంప్లీట్ చేయొచ్చని అనుకుంటారు. ఇలా మీరు ఒకటి రెండు రోజులు చేయడం వల్ల మీకు ఎలాంటి హాని జరగదు. కానీ తరచుగా చేస్తే మాత్రం మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నా ఆరోగ్య నిపుణులు. 

మధ్యాహ్నం తినకుండా ఉంటే ఏమౌతుంది? 

Latest Videos

శక్తి తగ్గుతుంది: మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ సమయానికి తింటేనే మీ శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తి అందుతుంది. దీంతో మీరు మీ రోజువారి పనులపై పూర్తి దృష్టి పెడతారు. బాగా పనిచేయగలుగుతారు. కానీ మీరు పని ఎక్కువగా ఉందని చెప్పి తినకపోతే మాత్రం తరచుగా ఆకలి అవడం, మైకంగా అనిపించడం, అలసట, మానసిక స్థితిలో మార్పులు రావడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. అందుకే మధ్యాహ్నం ఎంత పని ఉన్నా ఖచ్చితంగా తినండి. 

పనిపై దృష్టి సారించే సామర్థ్యం తగ్గుతుంది: మీరు తినే ఆహారమే మీ మెదడును మంచి పోషణను అందిస్తుంది. దీంతో మీ మెదడు బాగా పనిచేస్తుంది. అయితే మీరు మధ్యాహ్నం పూట తినకపోతే మీ మెదడుకు అవసరమైన పోషకాలు అందవు. దీనివల్ల మీరు సరిగ్గా పని చేయలేరు. అలాగే కష్టమైన పనులను చేయడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. 

హైపోగ్లైసీమియా:  రక్తంలో చక్కెర స్థాయిలకు అవసరానికి తగ్గకుండా ఆహారాలను తినడం చాలా చాలా అవసరం. అయితే మీరు మధ్యాహ్నం భోజనాన్ని స్కిప్ చేస్తే హైపోగ్లైసీమియా వస్తుంది. దీంతో శరీరంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోతాయి. దీంతో డయాబెటీస్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. 

బరువు పెరుగుతారు: మనలో చాలా మంది తినకపోతే బరువు తగ్గుతారని అనుకుంటారు. నిజమేంటంటే.. మీరు తినకపోతేనే మరింత బరువు పెరుగుతారు. ఎందుకంటే మీరు ఒకపూట భోజనం మానేస్తే తర్వాత పూట ఎక్కువ ఆకలి అవుతుంది. దీంతో మీరు ఎంత తింటున్నారో తెలుసుకోకుండా తింటారు. ఇది మీరు బరువు బాగా పెరిగేలా చేస్తుంది. 

జీర్ణక్రియ సమస్యలు వస్తాయి: మీరు ప్రతిరోజూ ఒకే సమయానికి తింటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పోషకాలు మీ మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే మీరు మధ్యాహ్నం భోజనం స్కిప్ చేస్తే మీకు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తినండి. 

మధ్యాహ్నం ఏమేమి తినాలి? 

ఆరోగ్యకరమైన ఆహారాలు: ఆఫీసులో కానీ , ఇతర చోట్ల పనిచేసే వారు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మధ్యాహ్నం పూట పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు వంటి హెల్తీ ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి. వీటిని తింటే మీ శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అలాగే మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

హైడ్రేటెడ్ గా ఉండండి: ఆరోగ్యంగా ఉండాలంటే మీరు హెల్తీ ఫుడ్ ను తినడమే కాకుండా.. రోజంతా హైడ్రేట్ గా ఉండాలి. ఇందుకోసం నీళ్లను పుష్కలంగా తాగాలి. అప్పుడే అలసట, తలనొప్పి వంటి సమస్యలు రావు. బాడీ డీహైడ్రేట్ అయితేనే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. 

తినేటప్పుడు పనికి బ్రేక్ ఇవ్వండి: కొంతమంది తినేటప్పుడు కూడా పనిచేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. తింటున్నప్పుడు పనికి దూరంగా ఉండండి. మీ మధ్యాహ్న భోజనాన్ని ఆస్వాదించడానికి కొన్ని నిమిషాల సమయాన్ని కేటాయించండి. అలాగే మీ మనస్సును మళ్లీ రీఫ్రెష్ గా చేయండి.

ఆరోగ్యకరమైన స్నాక్స్ : భోజనాల మధ్య ఆకలిగా అనిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ వెంట పండ్లు, గింజలు లేదా గ్రీకు పెరుగు వంటి కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తీసుకెళ్లండి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బయటితిండి తినకుండా చేస్తాయి. 

మీ సహోద్యోగులతో కలిసి భోజనం చేయండి:  ఒంటరిగా కాకుండా..  సహోద్యోగులతో కలిసి భోజనం చేయండి. ఇలా తినడం వల్ల మీ సంబంధాలు బలోపేతం అవ్వడమే కాకుండా.. పని ప్రాంతంలో సానుకూల వాతావరణం ఉంటుంది. 

click me!