గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఎలాంటి వంట నూనెలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు. దీంతో ఏదో ఒకటి వాడేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె జబ్బులు ఉన్నవారు ఎలాంటి నూనెను వాడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అనారోగ్యకరమైన కొవ్వులు మనకు అధిక రక్తపోటు నుంచి గుండెపోటు వరకు ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఈ వ్యాధుల బారిన పడకుండా కొంతమంది శుద్ధి చేసిన నూనెను ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది జీరో ఆయిల్ వంటను ఉపయోగిస్తారు. కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం హెల్తీ ఫ్యాట్స్ చాలా అవసరం.
టేస్ట్ కోసమని మనలో చాలా మంది వేయించిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. కానీ ఇవి గుండె జబ్బులున్నవారికి అస్సలు మంచివి కావు. నిజానికి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వంటకోసం ఏదో ఒక నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ఇది ధమనులు మూసుకుపోయేలా చేస్తుంది. కానీ అనారోగ్యకరమైన కొవ్వుల వల్ల హైబీపీ, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ జబ్బులేమీ రాకుండా ఉండటానికి కొంతమంది ఫ్యాన్సీ రిఫైన్డ్ ఆయిల్ ను ఉపయోగిస్తే మరికొంతమంది జీరో ఆయిల్ వంటను ఉపయోగిస్తారు. అసలు ఏ వంట నూనెలు గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
undefined
మనం ఏ నూనె వంటకు ఉపయోగించినా.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పై ప్రభావం చూపిస్తాయి. అందుకే కొబ్బరి నూనె, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులుండే నూనెలను వంటకు ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సంతృప్త కొవ్వులను వేడి చేసిన తర్వాత ఆక్సీకరణం పెరగదు. అలాగే దాంట్లో నుంచి విషపూరిత ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు రిలీజ్ కావు. అందుకే వీటిని వంటకు ఉపయోగించడం మంచిదని చెప్తారు. అలాగే మొక్కజొన్న నూనె, సోయాబీన్ ఆయిల్, రాప్సీడ్ ఆయిల్ కూడా మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి ఉపయోగపడతాయి. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. నూనెను వేడి చేయడ వల్ల దాంట్లో ఉండే సమ్మేళనాల విచ్ఛిన్నం బాగా పెరుగుతుంది. దీనివల్ల నూనె ఆక్సీకరణ చెందుతుంది. అలాగే దీనిలో ఫ్రీ రాడికల్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ వంటనూనె మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే సెల్యులార్ దెబ్బతినే ప్రమాదాన్ని కూడా బాగా పెంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. పామాయిల్, కొబ్బరినూనె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి.
అవొకాడో ఆయిల్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం..అవొకాడో నూనెలో ఒలేయిక్ ఆమ్లం ఉంటుది. ఈ నూనెను వాడితే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. అలాగే గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నూనెను వాడితే మీకు కీళ్ల నొప్పులు, మోకాళ్ల వంటి ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే తిన్న తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. ఈ నూనెను రెగ్యులర్ గా తీసుకుంటే మెటబాలిక్ వ్యాధులొచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.
నువ్వుల నూనె
నువ్వుల నూనె మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ నూనె ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ నూనెను ఉపయోగిస్తే మీ శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. అందుకే ఈ నూనె గుండె జబ్బులున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఇ కూడా మెండుగా ఉంటుంది. ఈ నూనెను వంటలో ఉపయోగించడం వల్ల టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం, హైబీపీ ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే ఇది మీ రక్త నాళాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతుంది. ఫలితంగా మీకు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ ఆలివ్ ఆయిల్ ను అర టీస్పూన్ తీసుకుంటే గుండె జబ్బులు రావు.
రైస్ బ్రాన్ ఆయిల్
రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెలో ఒరిసానాల్ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ నూనెలో ఉండే పాలీ, మోనోశాచురేటెడ్ కొవ్వులు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. దీనిలో ఉండే టోకోట్రియానాల్స్, ప్లాంట్ స్టెరాల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.