
ప్రస్తుత రోజులలో కూర్చునే జీవనశైలి, పెరిగిన ఒత్తిడి వల్ల మన ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా ఊబకాయం తీవ్రంగా పెరుగుతోంది. ఇది గుండె, మెదడు సమస్యలకు దారితీస్తోంది. దీనిని అదుపు చేయాలంటే సరైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. అయితే కొన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకొనే పానీయాలు కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఇలాంటి ప్రయోజనం కలిగించే ఒక ఇంటి చిట్కా 'పసుపు-నల్ల మిరియాల షాట్'. ఇది శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పానీయం రోజూ తీసుకుంటే జీవక్రియ వేగంగా పనిచేస్తుంది, బరువు తగ్గుతుంది.
ఇది తయారు చేయాలంటే, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ నల్ల మిరియాల పొడి తీసుకొని వాటిని నీటిలో పదినిమిషాలు మరిగించాలి. మరిగిన తరువాత వడకట్టి, అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో లేదా పడుకునే ముందు తాగితే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి.
ఈ షాట్‌లో ఉండే పసుపులో కర్కుమిన్, నల్ల మిరియాల్లో పిపెరిన్ అనే పోషకాల సమ్మేళనం శరీరానికి శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షణ పొందే అవకాశముంది.
అలాగే పసుపుతో పైనాపిల్, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి పదార్థాలతో కూడా వేరే షాట్లు తయారు చేసుకోవచ్చు. ఇవి శరీరానికి తేలికగా గ్రహించడం జరుగుతోంది. మంచి రుచి కూడా ఇస్తాయి. ఆరోగ్యానికి సహజ మార్గంగా సహాయం చేసే ఈ పానీయాన్ని 30 రోజులు నిరంతరం తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.