ఇలా చేస్తే విరేచనాలు తొందరగా తగ్గిపోతాయి

Published : May 16, 2023, 07:15 AM IST
ఇలా చేస్తే విరేచనాలు తొందరగా తగ్గిపోతాయి

సారాంశం

అరటిపండ్లు, బియ్యం, ఆపిల్ సాస్ వంటి కొన్ని ఆహారాలు విరేచనాలను తొందరగా తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే మలం గట్టిపడటానికి సహాయపడతాయి.   

విరేచనాలు ఒక సాధారణ సమస్య. అయితే వికారం, వాంతులు, కడుపు నొప్పి లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలతో విరేచనాలకు సంబంధం ఉంది. చిన్న పిల్లలలో అంటు విరేచనాలు సాధారణం. ఇవి  వైరస్ వల్ల ఎక్కువగా వస్తాయి. కలుషితమైన నీటిని తాగినా కూడా విరేచనాలు అవుతాయి. సరిగ్గా నిల్వ చేయని లేదా వండిన ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల కూడా విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య వల్ల చాలా బలహీనంగా అవుతారు. కానీ ఈ  లక్షణాలను తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.. 

హైడ్రేటెడ్ గా ఉండండి

విరేచనాలను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. విరేచనాల వల్ల నిర్జలీకరణం సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నీటిని ఎక్కువగా తాగాలి. హైడ్రేట్ గా ఉండటానికి, శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించడానికి నీటిని, మూలికా టీలను పుష్కలంగా తాగాలి.

ప్రోబయోటిక్స్

ఇవి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇవి గట్ బ్యాక్టీరియా సహజ సమతుల్యతను పునరుద్ధరించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. పెరుగు, మజ్జిగ ప్రోబయోటిక్స్ కు అద్భుతమైన వనరులు. ఇవి ప్రేగు కదలికలను నియంత్రించడానికి, విరేచనాల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి.

బ్రాట్ డైట్

బ్రాట్ డైట్ లో అరటిపండ్లు, బియ్యం, ఆపిల్ సాస్, టోస్ట్ ఉంటాయి. ఈ బ్రాట్ డైట్ విరేచనాలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. మలం గట్టిపడటానికి సహాయపడతాయి. విరేచనాలను ఎక్కువ చేసే  మసాలా, ఆయిలీ, అధిక ఫైబర్ ఆహారాలను తినకండి. 

అల్లం టీ

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థను ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది అల్లం. తాజా అల్లం ముక్కలను నీటిలో మరిగించి రుచి కోసం ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఈ టీ కడుపు నొప్పిని  తగ్గించడానికి, విరేచనాలను తగ్గించడానికి రోజంతా అల్లం టీని తాగండి.

లెమన్ వాటర్

నిమ్మకాయ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండి చిటికెడు ఉప్పు, తేనె కలపాలి. జీర్ణక్రియకు సహాయపడటానికి, విరేచనాలను నివారించడానికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగండి. 

విశ్రాంతి

ఒత్తిడి, ఆందోళనలు విరేచనాలతో సహా జీర్ణ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అందుకే ఈ సమయంలో ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవాలి. మనస్సు, శరీరాన్ని శాంతపరచడంలో సహాయపడటానికి లోతైన శ్వాస, ధ్యానం, యోగా వంటివి చేయండి. 

PREV
click me!

Recommended Stories

రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!
ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగితే ఎన్నో సమస్యలు దూరం!