
ఎండలు కూడా మన ప్రాణాలను తీసేయగలవు. అందుకే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎండ, వేడి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటుగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. మన శరీరంలో వేడి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు వడదెబ్బ తగులుతుంది. భారత్ లో గతంలో ఎన్నడూ లేనంతగా వడగాల్పులు వీస్తుండటంతో చాలా మంది చనిపోతున్నారు. అందుకే వడదెబ్బ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీని బారిన పడుకూడదంటే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోవాలి.
ఎండాకాలంలో మన శరీరానికి అవసరమైన ద్రవాలను తాగకుండా ఎక్కువ వేడి, తేమతో కూడిన వాతావరణంలో వ్యాయామం చేసినప్పుడు వడదెబ్బ తగులుతుంది. కానీ వ్యాయామం చేయని వారికి కూడా వడదెబ్బ తగలొచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎండలో, తగినంత నీరు తాగని వారికి కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.
వడదెబ్బ తగిలిన వారు ఎంత తొందరగా హాస్పటల్ కు వెళితే అంత మంచిది. చికిత్స తీసుకోకుండా ఉంటే శరీరంలో ఎన్నో అవయవాల వైఫల్యం సంభవిస్తుంది. ఇది మరణానికి కూడా దారితీస్తాయి. ఒక వ్యక్తి వేడెక్కినప్పుడు వేడి తిమ్మిరి, వేడి అలసట వంటి సమస్యలు వస్తాయి. వడదెబ్బ అంత ప్రాణాంతకం కానప్పటికీ చికిత్స చేయకపోతే ఎన్నో రోగాలు వస్తాయి.
వడదెబ్బ సంకేతాలు, లక్షణాలు
వడదెబ్బ కొట్టిన వారిని వీలైనంత తొందరగా నీడలోకి తీసుకురావాలి. శరీరాన్ని చల్లబరచాలి. ఇందుకోసం వారి శరీరంపై తడి బట్టలను వేయాలి. చల్లని నీటితో తుడవాలి. వారికి చల్లని గాలి తగిలేలా చూడాలి. రోగిపై చల్లటి నీటిని కూడా పోయొచ్చు. రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఇవన్నీ చేయండి.
వడదెబ్బను నివారించవచ్చా?
వేడి తిమ్మిరి లేదా వేడి అలసట లక్షణాలు మీలో ఉన్నాయేమో చూసుకోండి. వేడి తిమ్మిరి బాధాకరమైన కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. తలనొప్పి, వికారం లేదా వాంతులు వేడి అలసటకు కొన్ని లక్షణాలు. ఇది మీకు అలసట లేదా దాహాన్ని కలిగిస్తుంది. మీకు వేడి తిమ్మిరి లేదా వేడి అలసట లక్షణాలు ఉంటే వడదెబ్బ రాకుండా ఉండటానికి మీరు వెంటనే చేయాల్సిన పని మీ శరీరాన్ని చల్లబరచడం.