
రాక్ సాల్ట్ లేదా రాతి ఉప్పును నవరాత్రుళ్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. మీకు తెలుసా ఈ ఉప్పు మనం రోజూ వాడే ఉప్పు కన్నాఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనిని ఎన్నో ఔషదాల కోసం ఉపయోగిస్తారు. ఈ ఉప్పును పురాతన కాలం నుంచి కూడా ఉపయోగిస్తున్నారు. రాతిఉప్పును తీసుకోవడం వల్ల సాధారణ దగ్గు, జలుబు వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అ ఉప్పును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
రాతి ఉప్పులో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ పోషకాలన్నీ దీనిలో ఎక్కువగా ఉండవు. కానీ ఎంతోకొంత మాత్రం మన శరీరానికి అందుతాయి.
సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పుడు సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది మన శరీరంలో సోడియం కంటెంట్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. సోడియం అధికంగా, మొత్తమే లేకపోవడం రెండూ మన శరీరానికి అస్సలు మంచిది కాదు.
రాతి ఉప్పులో ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. అలాగే మన శరీరంలోని నరాల పనితీరు సక్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది. కానీ ఎలక్ట్రోలైట్ల గురించి, కండరాల తిమ్మిరితో వాటి సంబంధం గురించి వాదనలకు మద్దతు ఇవ్వడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం కావొచ్చు.
ఒక్కప్పటి ఆయుర్వేదం ప్రకారం.. రాతి ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయినప్పటికీ రాతి ఉప్పు మెరుగైన గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే బ్యాక్టీరియా సంక్రమణ, విరేచనాలతో పోరాడటానికి కూడా మనకు తోడ్పడుతుంది.
ఆయుర్వేదం కూడా రాతి ఉప్పు చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుందని సూచిస్తోంది. ఇది చర్మాన్ని బలోపేతం చేస్తుంది. పునరుత్తేజపరుస్తుంది. అలాగే తాజాగా కనిపించేలా చేస్తుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే సాధారణ టేబుల్ ఉప్పు కంటే రాతి ఉప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సహజంగా తయారవుతుంది. అలాగే ప్రాసెస్ అసలే చేయబడదు. అందుకే ఇది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఉప్పును తీసుకునే ముందు మీ సోడియం స్థాయిలను తనిఖీ చేయడం మర్చిపోకండి.