టేస్టీ టేస్టీ పీనట్ బటర్.. తింటే ఎన్ని లాభాలో..!

By Mahesh RajamoniFirst Published Mar 26, 2023, 1:59 PM IST
Highlights

వేరుశెనగ వెన్న రుచి అదిరిపోతుంది. అందుకే దీనికి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. వేరుశెనగ వెన్నను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుందో తెలుసా..!
 

పీనట్ బటర్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. క్రంచీ టోస్ట్ కు పీనట్ బటర్ ను రాసి తింటే టేస్ట్ ఎంతబాగుంటుందో .. ! నిజానికి దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరుశెనగ వెన్న ప్రోటీన్ల బాంఢాగారం. దీన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెకు మేలు

వేరుశెనగ వెన్నలో ఒలేయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను,  రక్తంలో చక్కెర లెవెల్స్ ను, బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పీనట్ బటర్ గుండెకు సంబంధిత అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

యాంటి క్యాన్సర్ గుణాలు

పీనట్ బటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి. వేరుశెనగలో విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల క్షీణతను మరమ్మత్తు చేయడానికి సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడతాయి. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం. 

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్  లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి కనీసం 2 రోజులు 5 టేబుల్ స్పూన్ల వేరుశెనగ వెన్నను తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం దాదాపు 30% తగ్గుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి.

తక్కువ కార్బ్ కంటెంట్

స్వచ్ఛమైన వేరుశెనగ వెన్నలో పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండదు. కానీ కొన్నిసార్లు దీనిని ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీలు, ప్రకటనకు విరుద్ధంగా సంకలనాలు, ఎక్కువ చక్కెరను కలుపుతాయి. వేరుశెనగలోని ప్రధాన కొవ్వులలో ఒకటైన ఒలేయిక్ ఆమ్లం ఈ ప్రయోజనాలకు అసలు కారణం. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందుకు తోడ్పడతాయి. 

బరువు తగ్గడం

వేరుశెనగ వెన్నకూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. స్వచ్ఛమైన వేరుశెనగ వెన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వేరుశెనగ వెన్నలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎక్కువ సేపు మీ కడుపును నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తాయి. కానీ వేరుశెనగ వెన్న మాత్రమే బరువు తగ్గడానికి సహాయపడదు.

click me!