దానిమ్మ జ్యూస్ తో బరువు తగ్గడమే కాదు ఆ ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా..!

By Mahesh RajamoniFirst Published Mar 26, 2023, 1:11 PM IST
Highlights

దానిమ్మ పండును తిన్నా.. దాన్ని జ్యూస్ గా చేసుకుని తాగినా బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గడం నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వరకు ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా? 

అరటి, ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ దానిమ్మ పండును మాత్రం చాలా మంది తినరు. నిజానికి ఈ పండ్లలోనే కాదు దానిమ్మ పండులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దానిమ్మ రసం పోషకాల బాంఢాగారం. దీనిలో పాలీఫెనాల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉండే దానిమ్మ రసం ఆరోగ్యకరమైనది. ఎన్నో జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది.

దానిమ్మ రసంలో సాధారణంగా ఎక్కువ చక్కెర, ఎక్కువ విటమిన్లు ఉంటాయి. దానిమ్మ రసంలో ఉండే చక్కెర అన్ని విటమిన్లు, ఖనిజాల కలయిక. అందుకే ఇది శరీరంలో సులభంగా విచ్ఛిన్నమై చాలా సులభంగా జీర్ణమవుతుంది. అలాగని దీన్ని ఎక్కువగా తాగకూడదు. మోతాదులో దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మీరు సులువుగా బరువు కూడా తగ్గుతారు. 

దానిమ్మ జ్యూస్ లో ఉండే డైటరీ ఫైబర్ శరీరం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కేలరీలను త్వరగా, సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ఇతర బెర్రీల మాదిరిగానే దానిమ్మలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియ రేటును పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల మనుగడకు కూడా సహాయపడుతుంది. 

మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న తక్కువ కేలరీలున్న పానీయం. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా, లోపలి నుంచి దృఢంగా, బయట నుంచి అందంగా కనిపించేలా చేస్తుంది. 

దానిమ్మ రసం పొటాషియానికి మంచి మూలం. ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు, హృదయ స్పందన రేటు నియంత్రణకు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో టానిన్లు, ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ అథెరోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.  ఇవి తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్ లేదా ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నెమ్మదింపజేస్తుంది. 

click me!