మీరు వేడినీటితో స్నానం చేస్తారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

By Mahesh RajamoniFirst Published Mar 26, 2023, 12:39 PM IST
Highlights

అది చలికాలమైనా, వానాకాలమైనా, ఎండాకాలమైనా సరే వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు చాలా మంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడినీటితో రోజూ స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా? 
 

కాలాలతో సంబంధం లేకుండా వేడినీటితో స్నానం చేస్తుంటారు చాలా మంది. చల్లనీటితో పోలిస్తే వేడి నీటితోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు. అవును వేడినీటితో స్నానం చేయడం వల్ల కండరాల ఉద్రిక్తత  నుంచి ఉపశమనం పొందడమే కాదు జలుబు, ఫ్లూ, ఒత్తిడి వంటి ఎన్నో సమస్యల లక్షణాల నుంచి ఉపశమనం పొందుతారు. వేడినీటి స్నానం మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అసలు వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. 

కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం

వేడినీటి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో ఇదీ ఒకటి. వేడినీటి స్నానం కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. కండరాలు నిరంతరం కదలడం వల్ల అవి బిగుతుగా మారుతాయి. ఇది కండరాల నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. అయితే వేడినీటి స్నానం మీ కండరాలను సడలించడానికి, ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీకు మీ కండరాలకు విశ్రాంతినిస్తుంది. 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

వేడినీటి స్నానం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మీ ఒంటిపై వేడి నీరు పడటం వల్ల మీ రక్త నాళాలు విస్తరిస్తాయి. దీంతో రక్త ప్రవాహం పెరుగుతుంది. పెరిగిన రక్త ప్రవాహం మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మీ చర్మ కణాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. 

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి వేడినీళ్లు కూడా ఎంతో సహాయపడతాయి. నీటి వేడి మీ నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. దీంతో మీ ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. వేడినీటి స్నానం వల్ల మీకు విశ్రాంతి కలుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి లేదా ఆత్రుతగా ఉంటే.. మీకు మరింత రిలాక్స్  కావడానికి వేడినీటితో స్నానం చేయండి. 

నిద్రకు సహాయపడుతుంది

మీకు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకుంటే.. పడుకునే ముందు వేడినీటితో స్నానం చేయండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఇది నిద్రపోయే సమయమని మీ శరీరానికి సంకేతాన్ని ఇస్తుంది. అంతేకాదు వేడినీటి షవర్ మీ మనస్సును శాంతపరచడానికి, విశ్రాంతినివ్వడానికి, రాత్రిళ్లు గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 

జలుబు, ఫ్లూ లక్షణాల ఉపశమనం 

వేడినీళ్లు జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. మీకు జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు మీ శరీరం వైరస్ తో పోరాడుతుంది. వేడి షవర్ ఈ సమస్యలను తగ్గించడానికి, దగ్గును పోగొట్టేందుకు, నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. వేడినీటి ఆవిరి గొంతు, నాసికా మార్గాలను క్లియర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. దీంతొ మీరు శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. 

click me!