తమలపాకును ఇలా తింటే ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా?

Published : Feb 12, 2023, 04:58 PM IST
 తమలపాకును  ఇలా తింటే ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా?

సారాంశం

తమలపాకు రుచికరంగానే కాదు ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.   

ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ఎక్కువయ్యారు. యూరిక్ ఆమ్లం రక్తంలో కనిపించే చెడు పదార్థం. దీని పరిమాణం పెరగడాన్ని వైద్య భాషలో హైపర్యూరిసెమియా అంటారు. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్ మాత్రమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు, ఎన్నో ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే యూరిక్ ఆమ్లం దీర్ఘకాలంలో బాగా పేరుకుపోతుంది.  ఈ సమస్యను తగ్గించుకోవడానికి చికిత్స ఉన్నప్పటికీ..  కొన్ని హోం రెమెడీస్ ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించొచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తమలపాకును తినడం వల్ల పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయి బాగా తగ్గుతుంది. 

యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో తమలపాకు ఎలా పనిచేస్తుంది?

యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి తమలపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. తమలపాకు సారం కొన్ని ఎలుకలకు ఇచ్చారు. ఈ సారం వల్ల వాటిలో యూరిక్ యాసిడ్ స్థాయి 8.09 మి.గ్రా / డిఎల్ నుంచి 2.02 మి.గ్రా / డిఎల్ కు తగ్గింది. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ళ వాపు, నొప్పిని బాగా తస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను ఇది తగ్గించడానికి సహాయపడుతుంది. 

తమలపాకును ఎలా తినాలి? 

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్లు రోజూ తమలపాకులను నమలాలి. ఇది మీ యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి పొగాకును తీసుకోకూడదు.  

తమలపాకు ఇతర ప్రయోజనాలు

నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

తమలపాకులో ఎన్నో యాంటీ మైక్రోబయల్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి నోటిలో నివసించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. నోట్లో ఉండే బ్యాక్టీరియా చెడు వాసనను కలిగిస్తాయి. అలాగే కావిటీస్, ఫలకం, దంత క్షయం సమస్యలను కలిగిస్తాయి. భోజనం తర్వాత తమలపాకు పాన్ ను తమలడం వల్ల గట్ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా నోటి దుర్వాసన వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

భోజనం తర్వాత తమలపాకును పక్కాగా నములుతుంటారు మన పెద్దలు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పేగు, గట్ ను రక్షించడానికి సహాయపడుతుంది. తమలపాకు జీవక్రియను పెంచుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ముఖ్యమైన విటమిన్లు, పోషకాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!