రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే వీటిని తినండి..

Published : Feb 11, 2023, 03:59 PM ISTUpdated : Feb 11, 2023, 04:01 PM IST
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే వీటిని తినండి..

సారాంశం

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహులు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.   

 గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి ఎప్పుడూ వింటుంటాం.. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మరేం లేదు.. ఆహారాలలో ఉండే కార్బోహైడ్రేట్ల కొలత.  మీరు తినే ఆహారాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. అందుకే  ఇలాంటి వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలనే తీసుకోవాలి. 

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కు, ఆరోగ్యానికి సంబంధం ఏంటి?

గ్లైసెమిక్ ఇండెక్స్ పబ్ మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అలాగే రక్తపోటును నియంత్రించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఒకవేళ మీరు వెయిట్ లాస్ కావాలని ప్రయత్నిస్తున్నా.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలనే తినాలి. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏయే ఆహారాల్లో తక్కువగా ఉంటుందంటే.. 

ఆరెంజ్ - జిఐ 1

నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లకు ఈ పండు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.

ద్రాక్ష - జీఐ 53

ద్రాక్షలో ఫైబర్, విటమిన్ బి 6 లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో కూడా  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని డయాబెటిస్ పేషెంట్లు లిమిట్ లో తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 

ఓట్స్ - జిఐ 3

ఓట్ మీల్ చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ కు గొప్ప వనరు. డయాబెటీస్ పేషెంట్లు దీన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

బ్రౌన్ రైస్ - జీఐ 4

డయాబెటీస్ పేషెంట్లు వైట్ రైస్ ను తినకూడదు. ఎందుకంటే దీనిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే డయాబెటీస్  రోగులు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను తినాలి. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. బ్రౌన్ రైస్ లో ఫైబర్ వంటి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

మజ్జిగ - జిఐ 5

మజ్జిగలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పానీయాన్ని తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. దీనిని మధుమేహులు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం