ఇందుకే అతిగా తినాలనిపిస్తుంది..!

Published : Mar 24, 2023, 01:45 PM IST
ఇందుకే అతిగా తినాలనిపిస్తుంది..!

సారాంశం

ఆకలి పెరగడానికి, అతిగా తినడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదేమైనా ఓవర్ గా తింటే బరువు పెరగడంతో పాటుగా ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. 

ఎంత తిన్నా ఆకలి తీరదని చాలా మంది అంటుంటారు. మితిమీరిన ఆకలి వివిధ కారణాల వల్ల కలుగుతుంది. నిద్ర లేకపోవడం, ఫైబర్ ను తగినంతగా తీసుకోకపోవడం, నిర్జలీకరణం, మందులు,  హార్మోన్ల అసమతుల్యతతో సహా అనేక అంశాలు అతిగా తినడానికి కారణమవుతాయి. 

ఆకలి, అతిగా తినడం వంటివి చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్యలు. ఎక్కువ ఆకలి, అతిగా తినడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు అతిగా ఆకలి ఎందుకు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిద్రలేమి

నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కలుగుతుంది. అందుకే మీ హార్మోన్లను నియంత్రించడానికి ప్రయత్నించండి. ఇందుకోసం రాత్రికి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. ఇది అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సిబిఐ) లో ఇటీవల ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. నిద్రలేమి ఉన్నవారు చక్కెర, ఉప్పు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్నే అతిగా తినే అవకాశం ఉందని కనుగొన్నారు.

ఒత్తిడి

ఒత్తిడి, ఆందోళనలు కూడా అతిగా తినడానికి దారితీస్తాయి. కార్టిసాల్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది. ఇది అతిగా తినడానికి కారణమవుతుంది. కార్టిసాల్ హార్మోన్ వల్లే ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి వారు చక్కెర లేదా కొవ్వు ఆహారాలనే తినాలనుకుంటారు. ఆకలి పెరిగితే అనారోగ్యకరమైన ఆహారానికి అలవాటు పడతారని నిపుణులు చెబుతున్నారు.

భోజనాన్ని స్కిప్ చేయడం

భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల పగటిపూట ఆకలి పెరగడం, అతిగా తినడానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, అతిగా తినే ప్రమాదాన్ని తగ్గించడానికి క్రమం తప్పకుండా టైం కి తినాలి. 

ఫైబర్ తక్కువగా తినడం

ఫైబర్ ఒక ముఖ్యమైన పోషకం. ఇది ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. తక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఆకలి పెరగడమే కాదు అతిగా తినడానికి కూడా దారితీస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. రోజుకు కనీసం 25 గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి. 

నిర్జలీకరణం

నిర్జలీకరణం కూడా అతిగా తినడానికి దారితీస్తుంది. హైడ్రేట్ గా ఉండటానికి, అతిగా తినే ప్రమాదాన్ని తగ్గించడానికి రోజంతా తగినంత నీటిని తాగండి. 

ఫాస్ట్ గా తినడం

చాలా ఫాస్ట్ గా తినడం వల్ల కూడా మీరు అతిగా తినే ప్రమాదం ఉంది. ఎందుకంటే కడుపు నిండినట్టుగా అనిపించదు. దీనివల్లే మోతాదుకు మించి తింటారు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. 

అధిక కేలరీల ఆహారాలు

అధిక కేలరీల ఆహారాలు కూడా కోరికలు, అతిగా తినడానికి కారణమవుతాయి. అందుకే ప్రాసెస్ చేసిన, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినండి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి. 

PREV
click me!

Recommended Stories

ఉదయమా లేక రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!