విశ్లేషణ: ఒమిక్రాన్ భయాలు.. క్లాత్ మాస్క్‌లు ప్రమాదకరమా, నిపుణుల మాటేంటీ..?

By Siva KodatiFirst Published Dec 25, 2021, 5:34 PM IST
Highlights

అత్యంత వేగంగా వ్యాపించే కరోనా రకం (coronavirus) ఒమిక్రాన్ (omicron) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో .. వైరస్ నుంచి రక్షణ కోసం సింగిల్ లేయర్ క్లాత్ మాస్క్‌లను (single layer mask) ఉపయోగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యంత వేగంగా వ్యాపించే కరోనా రకం (coronavirus) ఒమిక్రాన్ (omicron) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో .. వైరస్ నుంచి రక్షణ కోసం సింగిల్ లేయర్ క్లాత్ మాస్క్‌లను (single layer mask) ఉపయోగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో కేవలం వ్యాక్సిన్‌లపైనే ఆధారపడలేమని వైద్యులు పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ.. మానవ తప్పిదాలు కూడా వైరస్ విజృంభణకు కారణమవుతున్నాయని వారు అంటున్నారు. కోవిడ్‌పై పోరాటంలో.. ప్రధానంగా ఒమిక్రాన్‌ను కట్టడి చేయాలంటే మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం మాత్రమే ప్రధాన ఆయుధమని నిపుణులు చెబుతున్నారు. 

కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో .. నిపుణులు క్లాత్ మాస్క్‌లను వాడొచ్చని సూచించారు. ఎందుకంటే వైరస్‌ను ఎదుర్కోవడంతో పాటు ఉతికి మళ్లీ వాడుకునేందుకు గుడ్డతో తయారు చేసిన  మాస్క్‌లు (cloth masks ) బాగుంటాయని చెప్పారు. అదే సమయంలో ఎన్ 95, కే 95 మాస్క్‌లను కూడా ఉపయోగించాలని సూచించారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ (george washington university) అనుబంధ మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ లీనా వెన్ సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ.. క్లాత్ మాస్క్‌లు ముఖానికి అలంకరణ కంటే కొంచెం ఎక్కువేనన్నారు. 

అయితే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన ఈ పరిస్ధితుల్లో అలాంటి వాటికి చోటు లేదన్నారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు, నిపుణులు నెలలుగా హెచ్చరిస్తున్నారని లీనా గుర్తుచేశారు. ప్రధానంగా కే 95, ఎన్ 95 మాస్క్‌లను ఉపయోగించాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు. చిన్నా, పెద్దా కణాలను ముక్కు, నోటి వరకు రాకుండా అవి అడ్డుకుంటాయని లీనా చెబుతున్నారు. అయితే సర్జికల్ మాస్క్‌తో కలిపి క్లాత్ మాస్క్‌ను కలిపి డబుల్ మాస్క్‌గా (double mask) ఉపయోగించవచ్చు చెప్పారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్లాత్ మాస్క్‌ల్ని ఎక్కువగా సింగల్ లేయర్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. కే 95 మాస్క్‌లు 95 శాతం కణాలను ఫిల్టర్ చేస్తే.. క్లాత్ మాస్క్‌లు అంత సమర్థంగా పనిచేయవని అంటున్నారు. 

డబుల్ మాస్క్ ధరించేటప్పుడు ఈ విషయాలను పరిశీలించండి:

బయటి మాస్క్‌ లోపలి మాస్క్‌ని  మీ ముఖానికి దగ్గరగా నొక్కి వుంచడం వల్ల ఒక ముద్రలా ఏర్పడుతుంది. తర్వాత మీ మాస్క్‌పై చేతులను కప్పుకుని, ఊపిరీ పీల్చుకుని వదిలే సమయంలో అంచుల నుంచి గాలి వస్తుందో లేదో గుర్తించండి.

శ్వాస తీసుకోవడం: డబుల్ మాస్క్ పెట్టుకునేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి రావొచ్చు. అలాగే శ్వాస అందడం కూడా కష్టం కావొచ్చు.

దృష్టి: డబుల్ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఎదురుగా వున్న వస్తువులను, పరిసరాలను చూడటానికి అడ్దుతగలరాదు.

పరిస్థితి అంచనా వేయండి: బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించడం వల్ల ఒక ముసుగు పెట్టుకున్నా కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో డబుల్ మాస్క్ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. 

click me!