అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటున్నారా? డౌటే లేదు మీకు క్యాన్సర్ తో పాటు ఈ రోగాలు రావడం ఖాయం..

Published : Feb 14, 2023, 12:44 PM IST
అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటున్నారా? డౌటే లేదు మీకు క్యాన్సర్ తో పాటు ఈ రోగాలు రావడం ఖాయం..

సారాంశం

అల్ట్రా పాసెస్ చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిని తింటే ఊబకాయం, డయాబెటీస్ నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  

అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని  ఆరోగ్య నిపుణులు తరచుగా చెప్తుంటారు. ఎన్నో అధ్యయనాలు కూడా ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయని వెల్లడించాయి. frizzy drinks, బ్రెడ్ వంటి ప్యాకేజ్డ్ వస్తువులు, తినడానికి సిద్ధంగా ఉన్న తృణధాన్యాలు మొదలైనవి అన్నీ అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాల కిందికే వస్తాయి.ఈ ఆహారాల్లో సాధారణంగా ఉప్పు, కొవ్వు, చక్కెర లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే కొన్ని పదార్థాలు ఉంటాయి. ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనం కనుగొంది.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ క్యాన్సర్ కు దారితీస్తుంది

ఈక్లినికల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను తినడం వల్ల పెద్ద వారికి ఊబకాయం, టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలు టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటుంటారు. బ్రెడ్, బిస్కెట్లు, బ్రేక్ ఫాస్ట్ సెరెల్స్, కార్బోనేటేడ్ పానీయాలు, ఇన్ స్టంట్ సూప్ లు, పండ్ల ఫ్లేవర్ ఉన్నపెరుగు, హామ్, సాసేజ్లు, కొన్ని ఆల్కహాల్ పానీయాలు అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఉదాహరణలు.

అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారం ఇతర దుష్ప్రభావాలు

అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలు చవకైనవి. మంచి టేస్ట్ ను కూడా కలిగి ఉంటాయి. అందుకే దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తింటుంటారు. కానీ వీటిలో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు వంటి హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయి. వాటిలో డైటరీ ఫైబర్, విటమిన్లు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ -2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు మీ రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.

బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. 10 శాతం ఎక్కువ అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హృదయ సంబంధ వ్యాధులు, సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ (మెదడులో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే వ్యాధులు) వచ్చే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. అదే జర్నల్లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల మీ బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇది మరణానికి కూడా దారితీస్తుంది.

ప్రమాదాన్ని తగ్గించాలంటే? 

అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలను తింటే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయన్న సంగతిని తెలుసుకున్నాం.. అందుకే ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలను అసలే తినకండి. భోజనాల మధ్య మీకు ఆకలిగా అనిపించినప్పుడు తినడానికి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను దగ్గర పెట్టుకోండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలను తినండి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగండి. పోషకాలను పెంచడానికి మీ ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పండ్లను చేర్చండి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం