తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయా?

Published : Feb 13, 2023, 01:44 PM ISTUpdated : Feb 13, 2023, 01:45 PM IST
తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయా?

సారాంశం

ఈ రోజుల్లో గ్రీన్ టీ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని. ఈ సంగతి పక్కన పెడితే గ్రీన్ టీ కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందని చాలా మంది అంటుంటారు. మరి దీనిలో నిజమెంతంటే..?   

మార్కెట్ లోకి వచ్చిన కొత్త వస్తువులను పక్కాగా ట్రై చేయాలనుకుంటారు చాలా మంది. అది వస్తువైనా, మరేదైనా సరే. ముఖ్యంగా దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయంటే చాలు.. వాటిని వాళ్లు ఉపయోగించడమే కాకుండా వేరేవాళ్లను వాడమని సలహాలు కూడా ఇస్తుంటారు. కానీ ప్రతిదీ అందరిపై ఒకేలా పనిచేయదని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో గ్రీన్ టీని తాగేవారు ఎక్కువయ్యారు. కొద్ది రోజుల్లోనే గ్రీన్ టీ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. కానీ ఇది నిజంగా అజీర్ణాన్ని నివారించడానికి సహాయపడుతుందా? కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

గ్రీన్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే కాటెచిన్, కెఫిన్ కంటెంట్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అయితే గ్రీన్ టీని ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో తాగాలని నిపుణులు సలహానిస్తున్నారు. ముఖ్యంగా దీన్ని కాచిన వెంటనే చక్కెర లేకుండా తాగాలి. ఎందుకంటే సమయం గడుస్తున్న కొద్దీ గ్రీన్ టీ రుచి మారే అవకాశం ఉంది. అందుకే దీన్ని తయారుచేసిన వెంటనే తాగాలి. 

అయితే గ్రీన్ టీ కూడా ఒక్కొరిపై ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే గ్రీన్ టీ తాగిన తర్వాత మీకు ఆందోళనగా అనిపించినా.. నిద్ర సమస్యలు వచ్చినా.. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోకండి. లేదా మొత్తమే తాగకండి. గ్రీన్ టీ జీర్ణక్రియకు సహాయపడొచ్చు, కానీ ఇది జీర్ణ సమస్యలన్నింటినీ తగ్గించలేదు. చికిత్సకు ఇది ప్రత్యమ్నాయం అసలే కాదు. అందుకే జీర్ణసమస్యలుంటే హాస్పటల్ కు వెల్లండి. 

గ్రీన్ టీ ఎలా పని చేస్తుంది?
 
గ్రీన్ టీలో జీర్ణక్రియకు సహాయపడే, ఉబ్బరాన్ని తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్, కెఫిన్ పేగు పనితీరును, దాని చలనశీలతను మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణవ్యవస్థలో ఆహారం మరింత సమర్థవంతంగా కదలడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ ఉబ్బరం, గ్యాస్ వంటి అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కొంతమంది అనుకుంటారు. అయితే గ్రీన్ టీ అందరిపై ఒకేరకమైన ప్రభవాన్నిచూపించదు. మీరు తినే ఆహారం, మీ ఒత్తిడి లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల అజీర్ణం, ఉబ్బరం సమస్యలు వస్తాయి. 

గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం ఏది?

గ్రీన్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. గట్ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్, కెఫిన్ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఇది ఆహారం కదలడానికి, ప్రేగులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీంతో ఉబ్బరం తగ్గుతుంది. అయితే గ్రీన్ టీని తాగడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా మధ్యాహ్నం. నిద్రపోయే సమయంలో దీన్ని తాగితే  సరిగ్గా నిద్రపట్టకపోవచ్చు. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ మీ నిద్రను దెబ్బతీస్తుంది. పరిగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గ్రీన్ టీ అజీర్తిని నివారిస్తుందా? 

భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే ఉబ్బరం కూడా తగ్గిపోతుంది. అయితే దీనిని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువ. ఆహారం, ఒత్తిడి, అనేక ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణ సమస్యలను పోగొట్టుకోవడానికి గ్రీన్ టీని తాగే ముందు డాక్టర్ ను సంప్రదించండి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cancer Risk Habits: మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్‌కు కారణం.. వెంటనే మారకపోతే డేంజరే !
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే