భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా... పొరపాటున కూడా ఇలా చేయకండి!

Published : Feb 18, 2023, 02:50 PM IST
భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా... పొరపాటున కూడా ఇలా చేయకండి!

సారాంశం

సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత కొందరు వెంటనే ఏదైనా ఫ్రూట్స్ తినడం టీ తాగడం లేదా స్నానాలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.  

సాధారణంగా చాలామంది భోజనం చేసిన తర్వాత కొన్ని రకాల పనులను చేయటం వల్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.కొందరు భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం లేదా మరి కొందరు తిన్న ఆహారం బాగా జీర్ణం అవడం కోసం పండ్లను తినడం చేస్తుంటారు. ఈ విధంగా భోజనం తర్వాత కొందరు కొన్ని రకాల పనులను చేస్తూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమై మనకు జీర్ణక్రియలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా మన శరీరానికి సరైన స్థాయిలో పోషకాలను అందించాలి అంటే భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదనే విషయానికి వస్తే...

చాలామంది భోజనానికి ముందు లేదా భోజనానికి తర్వాత పెద్ద ఎత్తున వివిధ రకాల పండ్లను తింటూ ఉంటారు.ఇలా భోజనానికి ముందు తర్వాత పండ్లు తినడం మంచిది కాదు ఇలా తినడం వల్ల పొట్ట పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చాలామంది భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా వాకింగ్ చేయకూడదు పది నిమిషాలు గ్యాప్ ఇచ్చిన అనంతరం వాకింగ్ చేయడం మంచిది.ఇక చాలామంది భోజనం చేసిన తర్వాత కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది అయితే ఇలా భోజనం తర్వాత కాఫీ టీలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఇక చాలామంది తిన్న వెంటనే పొట్ట బరువై అలాగే నిద్రపోతూ ఉంటారు.

ఈ విధంగా తిన్న తర్వాత నిద్రపోవటం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు సరైన క్రమంలో జీర్ణం కావు అందువల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే తిన్న వెంటనే ఎప్పుడు నిద్ర పోకూడదు. ఇక చాలామంది తిన్న తర్వాత స్నానానికి వెళ్తారు.ఇది చాలా పెద్ద పొరపాటు మనం తిన్న వెంటనే స్నానానికి వెళ్లడం వల్ల స్నానం చేసే సమయంలో ఒక్కసారిగా మన శరీరం చల్లబడుతుంది. దీంతో జీర్ణక్రియ రేటు కూడా తగ్గిపోతుంది. జీర్ణక్రియ రేటు తగ్గడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాదు. అందుకే తిన్న వెంటనే స్నానానికి కూడా వెళ్లకూడదు. ఇలా భోజనం తర్వాత ఈ పనులను చేయకపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం