పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డైట్ తప్పనిసరి.. ఎప్పుడు ఏం ఇవ్వాలో తెలుసా?

Published : Feb 18, 2023, 01:50 PM IST
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డైట్ తప్పనిసరి.. ఎప్పుడు ఏం ఇవ్వాలో తెలుసా?

సారాంశం

చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు ఎంతో కేర్ తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా వారు తీసుకునే ఆహార పదార్థాలలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు సరైన సమయానికి ఈ డైట్ తప్పనిసరి అని నిపుణులు  చెబుతున్నారు.  

ఇలా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం నిత్యం ఎలాంటి ఆహార పదార్థాలను వారికి అందించాలి ఏ సమయంలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనే విషయాలను తెలుసుకుందాం... సాధారణంగా చిన్నపిల్లలలో రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది కనుక తొందరగా వారికి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలకు ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఇవ్వటం వల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి పెరిగి తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

ఇలా పిల్లల విషయంలో తల్లిదండ్రులు స్పెషల్ కేర్ ఎంతో అవసరం. మరి పిల్లల ఆరోగ్యానికి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి పిల్లల డైట్ చార్ట్ ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

ఉదయం 6గంటలకు: ఒక గ్లాస్ పాలు రెండు నానబెట్టిన బాదంపప్పులు
ఉదయం 8 గంటలకు: చట్నీ లేదా సాంబార్ తో కలిపి ఒక ఇడ్లీ లేదా ఎగ్ దోస తినిపించాలి.
ఉదయం 11 గంటలకు: ఒక అరటిపండు లేదా ఇతర పండ్లు ఏదైనా ఒకటి తినిపించాలి.

మధ్యాహ్నం 1 గంటకు: నెయ్యితో కలిపి అన్నం పప్పు కాస్త పెరుగన్నం తినిపించాలి.
మధ్యాహ్నం 3 గంటలకు: నువ్వుల లడ్డు లేదా ఒక పల్లి పట్టి తినిపించాలి.
సాయంత్రం 5 గంటలకు: తిరిగి మరోసారి ఏదైనా ఒక ఫ్రూట్ తినిపించాలి.
సాయంత్రం 7 గంటలకు: రాజ్మా లేదా వెజిటేబుల్ కర్రీతో చపాతి తినిపించాలి.

రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ పాలతో పాటు రెండు ఖర్జూరాలు తినిపించాలి. ఇలా పిల్లల ఆహార విషయంలో ప్రతిరోజు ఇలాంటి డైట్ ఫాలో కావటం వల్ల పిల్లలలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉంటారు.

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం