Health Tips: జీలకర్రలోనూ బీ12 ఉందా? శాకాహారులకు మంచి ఆరోగ్య రహస్యం

Published : May 28, 2025, 02:31 PM ISTUpdated : May 28, 2025, 03:03 PM IST
Health Tips: జీలకర్రలోనూ బీ12 ఉందా? శాకాహారులకు మంచి ఆరోగ్య రహస్యం

సారాంశం

శాకాహారులకు బీ12 దొరికే సహజ మార్గంగా జీలకర్ర నిలుస్తోంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జీలకర్ర అనగానే మనకు వంటల రుచులే గుర్తొస్తాయి. అయితే ఇది కేవలం రుచిని కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, జీలకర్రలో విటమిన్ బీ12 కూడా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకంలో ఒకటి. ముఖ్యంగా శాకాహారులు బీ12కు ప్రత్యామ్నాయంగా జీలకర్రను ఉపయోగించవచ్చు.

విటమిన్ బీ12 లోపం ఉన్నవారు అలసట, మానసిక అయోమయం, నర సంబంధిత సమస్యలు, రక్తహీనతతో బాధపడతారు. దీనికి సాధారణ పరిష్కారం మాంసాహారమే అనుకునే వారు చాలామంది. కానీ శాకాహారంలోనూ బీ12 అందించే అవకాశాలు ఉన్నాయి. అందులో జీలకర్ర ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.

జీలకర్రను దైనందిన వంటల్లో ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, రక్తహీనత తక్కువవుతుంది. ఇందులో క్యాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉండటం వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో నిక్షిప్తమైన విష పదార్థాలు బయటికి పోతాయి. ఈ నీళ్లు శరీరంలో మంటను తగ్గించడంలో, బరువు నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి.

జీలకర్ర టీ కూడా ఆరోగ్యానికి మంచి మిత్రం. ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. అలసటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాదు, ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది.

ఇలా చూస్తే, జీలకర్ర కేవలం వంటల పరిమితమైన మసాలా కాదని తెలుస్తుంది. ఇది ఒక ఆరోగ్య రహస్యం. బీ12 కోసం శాకాహారులు వేరే మార్గాలు వెతకాల్సిన అవసరం లేకుండా, రోజువారీ ఆహారంలో జీలకర్రను చేర్చడం వల్ల ఆరోగ్యాన్ని సమతుల్యం చేయవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం