
కొంతమంది నోటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా.. నోటి నుంచి మాత్రం దుర్వాసన వస్తుంటుంది. ఈ నోటి దుర్వాసన వల్ల మీకూ ఇబ్బందీ.. ఇతరులకూ ఇబ్బందీ.. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నోటి దుర్వాసనను తగ్గించ్చంటున్నారు నిపుణులు. అయితే నిమ్మరసం మౌత్ వాష్ గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉపయోగించడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది.
సరిగ్గా బ్రష్ చేస్తే నోటి దుర్వాసన ఉండదు. అయితే కొన్ని గంటలు మాట్లాడకుండా ఉన్నా.. నీటిని సరిగ్గా తాగకపోయినా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. ఎందుకంటే నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల నోటి నుంచి చెడు వాసన వస్తుంది. అయితే దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లినా టూత్ బ్రష్ ను, టూత్పేస్ట్ ను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అయితే పుదీనా కూడా నోటి దుర్వాసనను పోగొడుతుంది. దీనితో పాటు నిమ్మరసం కూడా నోటి దుర్వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది. నోటి దుర్వాసనను పోగొట్టడానికి నిమ్మరసం మంచిదని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నిమ్మరసం ఆరోగ్య ప్రయోజనాలు
సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ పండు పుల్లగా ఉంటుంది. దీని నుంచి మన శరీరానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ నిమ్మరసం జీర్ణక్రియను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిమ్మరసంతో దాహం, వికారం, అజీర్థి వంటి సమస్యలు తగ్గుతాయి.
నోటి దుర్వాసనకు నిమ్మరసం
నిమ్మరసం విటమిన్ సి కి మంచి వనరు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ చిగుళ్ళలోని బంధన కణజాలాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది చిగుళ్లవాపు వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది నోటి దుర్వాసనను నివారిస్తుంది. కానీ నోటి దుర్వాసనకు దంతవైద్యుడు సిఫారసు చేసే ప్రొఫెషనల్ క్లీనింగ్ కు నిమ్మరసం ప్రత్యామ్నాయం కాదని డాక్టర్లు చెబుతున్నారు. బ్రష్ చేయడం, ఫ్లోసింగ్ చేయడం, నాలుకను శుభ్రం చేయడానికి మీ నోటి పరిశుభ్రత చిట్కాలను పాటించాలి.
నోటి దుర్వాసనను పోగొట్టడానికి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి?
ఇందుకోసం నిమ్మకాయలను పిండి ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తర్వాత మౌత్ వాష్ గా ఉపయోగించండి. కానీ నిమ్మరసాన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం అధికంగా ఉపయోగించడం వల్ల ఎక్కువ సిట్రిక్ యాసిడ్ కంటెంట్ వల్ల దంతాలు అరిగిపోతాయి. నోటి దుర్వాసనను పోగొట్టడానికి రోజంతా 2 నుంచి 3 నిమ్మకాయల రసాన్ని ఉపయోగించొచ్చు. ఇంతకంటే ఎక్కువగా ఎక్కువ అస్సలు ఉపయోగించకూడదు. దంతాలు అరిగిన, విరిగిన వాళ్లు నిమ్మరసాన్ని ఉపయోగించకూడదు. నిమ్మరసంలో కొన్ని కీరదోసకాయ ముక్కలు, కొన్నితాజా పుదీనా లేదా అల్లాన్ని కలిపి తాగితే మీరు నోటి నుంచి వాసన వస్తుంది. అలాగే తాజాగా ఉంటుంది.