రాత్రిపూట పడుకునే ముందు ఈ గింజలను తింటే ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుందో..!

By Mahesh RajamoniFirst Published Feb 9, 2023, 2:58 PM IST
Highlights

రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే వరకు  ఏదో ఒకటి తింటూనే ఉంటారు కొందరు. ఏది పడితే అది తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే  ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మనం తినే ఆహారంపైనే మన మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారాను తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఆనారోగ్యకరమైన ఆహారాలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే తినే ఆహారంపై దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.  థైరాయిడ్ సంబంధిత సమస్యలను దూరంగా ఉండాలంటే.. మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రతగా ఉండాలంటున్నారు నిపుణులు. 

అయితే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత కూడా పడుకునే వరకు ఏదో ఒకటి తినే వారు చాలా మందే ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందికి ఇది అలవాటుగా మారిపోయింది. కానీ ఇలాంటి సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలను తింటుంటారు. కానీ ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తింటేనే శరీరం సురక్షితంగా ఉంటుంది. ఎన్నో జబ్బుల ముప్పు నుంచి తప్పించుకుంటుంది. థైరాయిడ్ సమస్యలను దూరం చేయడానికి సహాయపడే  హెల్తీ స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నానబెట్టిన గింజలు

మన శరీరానికి గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందులో గింజలను నానబెట్టి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. గింజలు పోషకాల భాండాగారం. గింజల్లో ఉండే సెలీనియం అనే సమ్మేళనం థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ నాలుగైదు నానబెట్టిన గింజలను మాత్రమే తినాలి. అతిగా తింటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. 

కొబ్బరి

కొబ్బరి నూనే కాదు కొబ్బరి కూడా మన శరీరానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అయినా కొబ్బరి ప్రతి వంటింటిలో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎన్నో వంటల్లో వాడుతారు. కానీ కొంతమంది కొబ్బరికాయలను అస్సలు తినరు. కానీ దీన్ని తినడం వల్ల  మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందులో రాత్రిపూట తింటే ఇంకా మంచిది. దీనిని నేచురల్ స్నాక్స్ గా తీసుకోవచ్చు. కొంతమంది కొబ్బరిని బెల్లంతో కలిపి తింటారు. ఇలా తినడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి తెలుసా? కానీ ఎక్కువగా తినకండి.

గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. రాత్రిపూట తినగల ఆరోగ్యకరమైన చిరుతిండి ఇది. థైరాయిడ్ పేషెంట్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ కాల్చిన గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. గుమ్మడికాయలో ఉండే జింక్ థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది.  ఈ గింజలుల మీరు రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి సహాయపడతాయి. 

click me!